సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు(K.Raghavendra Rao), ఆయన సోదరుడు కె.కృష్ణమోహన్‌రావులకు(K. Krishna Mohan Rao) హైకోర్టు(High court) గురువారం నోటీసులు(Notices) జారీ చేసింది. బంజారాహిల్స్ షేక్‌పేటలో రెండు ఎకరాల భూకేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్(Balakishan) హైకోర్టులో పిల్ వేశారు.

Court Notices to Raghavendra Rao
సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు(K.Raghavendra Rao), ఆయన సోదరుడు కె.కృష్ణమోహన్‌రావులకు(K. Krishna Mohan Rao) హైకోర్టు(High court) గురువారం నోటీసులు(Notices) జారీ చేసింది. బంజారాహిల్స్ షేక్‌పేటలో రెండు ఎకరాల భూకేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్(Balakishan) హైకోర్టులో పిల్ వేశారు. రాయితీ ధరతో భూమిని కేటాయిస్తే రాఘవేంద్రరావు ఆ భూమిని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని బాలకిషన్ అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరావుకు నోటీసులు పంపింది.
