నందమూరి(Anndhamuri) ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు.

నందమూరి(Anndhamuri) ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. బాలకృష్ణ(Nandhamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ(mokshagna) సినిమాల్లోకి వచ్చేశాడు. ఇంతకాలం అదిగో ఇదిగో అంటూ ఫ్యాన్స్‌ను ఊరించారు. ఇప్పుడు కన్‌ఫామ్‌ చేశారు. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ(Prashanth varma) ఈ ప్రాజెక్టును భుజనా వేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్‌ కమింగ్‌(Simba Is Comming) అంటూ మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. రెండు రోజులుగా ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి పరోక్షంగా చెబుతూ వచ్చారు. నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది అని, వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం అని వరుస పోస్టులు పెట్టాడు ప్రశాంత్‌ వర్మ. లేటెస్ట్‌గా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలకృష్ణ వారసుడిని పరిచయం చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. పౌరాణికంతో కూడిన సోషల్‌ మూవీని తీయబోతున్నట్టు సమాచారం. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని.. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని ఇంతకు మందే ప్రశాంత్‌ వర్మ చెప్పాడు. మోక్షజ్ఞ కూడా సూపర్‌హీరోగా నటిస్తాడన్నమాట!

Eha Tv

Eha Tv

Next Story