చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. అనూహ్య విజయంతో పాటు.. అవార్డ్ ల పంట పండించింది బలగం(Balagam) సినిమా. ఈసినిమా థియేటర్ లోనే కాదు..ఓటీటీలోనే కాదు.. టెలివిజన్ లో కూడా సత్తా చాటింది. అది కూడా రెండో సారి..
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. అనూహ్య విజయంతో పాటు.. అవార్డ్ ల పంట పండించింది బలగం(Balagam) సినిమా. ఈసినిమా థియేటర్ లోనే కాదు..ఓటీటీలోనే కాదు.. టెలివిజన్ లో కూడా సత్తా చాటింది. అది కూడా రెండో సారి..
ప్రియదర్శి(Priya Dharshi), కవ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) హీరో హీరోయిన్లుగా.. అచ్చమైన తెలంగాణా(Telangana) పల్లెల్లో జరిగే నిజమైన కథల ఆధారంగా తెరకెక్కిన సినిమా బలగం. పల్లెలో పట్టింపులు, ఆచారాలు...వ్యావహారాలు.. చిన్న చిన్న గొడవలు. బంధుత్వాలు.. మనుషులు విలువలు.. ఇలా రకరకాల విలువలు నేర్పిన సినిమా బలగం. ఈసినిమా నిర్మాత దిల్ రాజుకు కాసుల పండ పండించడమే కాదు.. దాదాపు 100కు పైగా అవార్డ్ లను కూడా సాధించిన నిలిచిపోయింది.
టాలీవుడ్ లో మంచి కంటెంట్ తో సినిమా వస్తే ఆడియెన్స్ ఆదరిస్తారు అని మరోసారి రుజువు చేసిన సినిమా బలగం.సినిమా చిన్నదే అయినా, దాని ప్రభావం ఈ ఏడాది గట్టిగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుది కాదు. బుల్లితెర పై కూడా అదే తీరుని కనబరుస్తోంది ఈ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్.
ప్రముఖ జబర్థస్త్ కమెడియన్.. వెండితెర నటుడు, వేణు(Venu) డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన మొదటి చిత్రం ఇది. ఈసినిమాతో అతని పేరు బలగం వేణుగా నిలబడిపోయింది. ఇక ఈ చిత్రం లాస్ట్ వీక్ బుల్లితెర పై మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం 7.71 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇంకెలంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.