ఇక తన నెక్ట్స్ సినిమాలను కూడా కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. కథలసెలక్షన్ లో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. విలక్షణ దర్శకులతో ఉండేలాచూసుకుంటున్నాడు. దర్శకుల ఎంపికలో కూడా నాని తన మార్క్ చూపిస్తున్నాడు. పస్తుతం హాయ్ నాన్న సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడునాని. డిసెంబర్ 7న రిలీజ్ కాబోతోంది.

బలగం దర్శకుడు వేణుకి బంపర్ ఆఫర్ ఎదురెళ్ళింది. ఏకంగా నేచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే సినిమా కన్ ఫార్మ్ అవ్వలేదు కాని.. వేణుకి డైరెక్ట్ ఆఫర్ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు.. కొత్త దర్శకులు, హిట్ కాన్సెప్ట్.. ఇది నాని ఫార్ములా.. ఇప్పటికే ఇలాంటి ఫార్ములాతోనే దసరా సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం హాయ్ నాన్నని తీసుకు వస్తున్నాడు నాని.

ఇక తన నెక్ట్స్ సినిమాలను కూడా కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. కథలసెలక్షన్ లో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. విలక్షణ దర్శకులతో ఉండేలాచూసుకుంటున్నాడు. దర్శకుల ఎంపికలో కూడా నాని తన మార్క్ చూపిస్తున్నాడు. పస్తుతం హాయ్ నాన్న సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడునాని. డిసెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఉత్సాహంతో ప్రమోషన్స్ చేస్తున్నాడు అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా నాని ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు.

ఈక్రమంలోనే ఒక అభిమాని.. కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. బలగం వేణు అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల తన రెండో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాని ఈ కామెంట్స్ చేయడంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పక్కాగా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు నాని.

ఇక నాని తన 31వ సినిమా కూడా సెట్ చేసుకున్నాడు. సరిపోదా శనివారం’ అనే టైటిల్ తో రాబోతున్నఈసినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో అంటే సుందరానికి మూవీ వచ్చింది. సూపర్ హిట్ కాకపోయినా.. నాని అభిమానులను అలరించింది సినిమా. హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. అయితే ఆసారి మాత్రం వీరికాంబోలో మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు.

Updated On 6 Dec 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story