నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటిస్తున్న చిత్రం ఎన్బీకే 108. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్‏చల్ చేస్తోంది. మూవీ సెట్ లో హీరోయిన్ శ్రీలీలకు బాలయ్య బాబుకు ఓ చిన్న సంఘటన జరిగిందట. దీంతో శ్రీలీల చెంపపై ఒక్కటిచ్చాడట మన బుల్ బుల్ బాలయ్య. ఇక చేసేందేమీ లేక సెట్స్ నుంచి కన్నీరుపెట్టుకుని వెళ్లిపోయిందట బ్యూటీ శ్రీలీల (Sreeleela).

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటిస్తున్న చిత్రం ఎన్బీకే 108. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్‏చల్ చేస్తోంది. మూవీ సెట్ లో హీరోయిన్ శ్రీలీలకు బాలయ్య బాబుకు ఓ చిన్న సంఘటన జరిగిందట. దీంతో శ్రీలీల చెంపపై ఒక్కటిచ్చాడట మన బుల్ బుల్ బాలయ్య. ఇక చేసేందేమీ లేక సెట్స్ నుంచి కన్నీరుపెట్టుకుని వెళ్లిపోయిందట బ్యూటీ శ్రీలీల (Sreeleela). ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బాలయ్యకు ఇంత కోసం రావడానికి శ్రీలీల ఏం చేసిందని, ఆమె చేసిన తప్పేంటని జనాలు ప్రశ్నిస్తున్నారు.

అయితే వాస్తవానికి అక్కడి జరిగింది వేరేనట. షూట్ సమయంలో శ్రీలీలను కొట్టే సీన్ చేస్తున్నారట మేకర్స్. అప్పుడు ఈ సీన్ బాగా రావడం కోసం.. తన చెంపపై కొట్టమని శ్రీలీల (Sreeleela) బాలయ్య బాబును కోరిందట. దాంతో ఆ సీన్ బాగా రావడం కోసం బాలయ్య బాబు (Balayya Babu) శ్రీలీల చెంపపై కొట్టాడట. దీంతో సెట్‏లో ఉన్నవారంతా షాక్ అవ్వడంతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సైలెంట్ అయ్యాడట. సీన్ పూర్తి చేశాక ఎవ్వరూ కట్ కూడా చెప్పలేదట. ఎందుకంటే ఆ సీన్ అంత బాగా వచ్చిందట. నటనపై శ్రీలీలకు ఇంత డెడికేషన్ ఉందని అక్కడ ఉన్నవారంతా శ్రీలీలపై ప్రశంసలు కూరిపించారట.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఎన్బీకే 108 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‏గా నటిస్తుండగా.. శ్రీలీల బాలకృష్ణకు మేనకోడలు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల టాలీవుడ్‏కు పరిచయం అయింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా చిత్రంతో ఫస్ట్ సక్సెస్‏ను పాకెట్‏లో వేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు ప్రాజెక్టులకు సైన్ చేసింది. ప్రస్తుతం చేతిలో ఎనిమిది ప్రాజెక్టులో బిజిబిజిగా ఉంది ఈ అమ్మడు.

Updated On 26 May 2023 11:48 PM GMT
Ehatv

Ehatv

Next Story