బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా భగవంత్‌ కేసరి. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా భగవంత్‌ కేసరి. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలోని గణేష్‌ సాంగ్‌ ప్రోమోను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రీలీల బాబాయ్‌గా బాలకృష్ణ కనిపిస్తారని, ఇద్దరి మధ్య అనుబంధం కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. గణేష్‌ సాంగ్‌ ప్రోమో ఇంట్రడక్షన్‌ తెలంగాణ యాసలో ఆకట్టుకుంది. బిడ్డా ఆన్‌తలేదు..సప్పుడు జర గట్టిగ జేయమను.. అని బాలకృష్ణ కోరతాడు. అందుకు శ్రీలీల తీసి పక్కన పెట్టండిరా మీ తీన్‌మార్‌..మా చిచా వచ్చిండు ఎట్లుండాలే..కొట్టర కొట్టు సౌమార్‌’ అంటూ డ్యాన్సర్ల బృందాన్ని ఉత్సాహపరిచే సన్నివేశాలతో ప్రోమో ఆకట్టుకుంది. ఈ పాటను సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్‌ రాంపాల్‌ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Updated On 31 Aug 2023 11:39 PM GMT
Ehatv

Ehatv

Next Story