బిగ్ బాస్-5 సీజ‌న్ విన్న‌ర్‌ వీజే సన్నీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ప్ర‌స్తుత రాజ‌కీయాల దృష్ట్యా తాను సొంత‌ రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు నా పార్టీ అనౌన్స్‌మెంట్ ఉంటుంది. ప్ర‌జ‌లంద‌రికీ మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డానికి పార్టీని ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు.

బిగ్ బాస్-5 సీజ‌న్ విన్న‌ర్‌ వీజే సన్నీ(VJ Sunny) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ప్ర‌స్తుత రాజ‌కీయాల దృష్ట్యా తాను సొంత‌ రాజ‌కీయ పార్టీ(New Political Party)ని స్టార్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు నా పార్టీ అనౌన్స్‌మెంట్(Announcement) ఉంటుంది. ప్ర‌జ‌లంద‌రికీ మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డానికి పార్టీని ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. అంద‌రి స‌పోర్టు ఉంటుంద‌ని భావిస్తున్నాన‌ని ఓ వీడియో(Video) ద్వారా త‌న సందేశాన్ని తెలియ‌జేశాడు.

జస్ట్ ఫర్ మెన్(Just For Men) అనే టీవీ షో(TV Show)తో ద్వారా యాంక‌ర్ స‌న్నీ యాంకర్(Anchor)‏గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్(News Reporter)‏గా పనిచేశాడు. ఆ త‌ర్వాత‌ కళ్యాణ వైభోగం(Kalyana Vaibogam) అనే టీవీ సీరియల్(TV Serial) ద్వార‌ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌న్నీ.. బిగ్‏బాస్(BiggBoss) లో అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడు. త‌న ఆట‌తో బిగ్‏బాస్ సీజన్ 5 విజేత(Biggboss-s Winner)గా నిలిచాడు. ఆపై కొన్ని సినిమాల్లో కూడా న‌టించాడు.

1989లో ఖమ్మం(Khammam)లో పుట్టిన స‌న్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి(Arun Reddy). స‌న్నీ తల్లి కళావతి(Kalavathi) స్టాఫ్ నర్సు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్(Ujwal), స్పందన్(Spandan). సన్నీ స్కూలింగ్ ఖమ్మంలోనే పూర్తిచేశాడు. ఇంట‌ర్ క‌రీంన‌గ‌ర్‌(karimnagar), హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో బీ.కామ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న సన్నీ.. ఆ దిశ‌గా అడుగులు వేసి స‌క్సెస్ అయ్యాడు. మ‌రి రాజ‌కీయంగా ఎటువంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌నున్నాడో మున్ముందు చూడాలి మ‌రి.

Updated On 27 Jun 2023 9:13 PM GMT
Yagnik

Yagnik

Next Story