బూతులతో ఎదుటివాళ్లను నవ్వించడం ఈజీ.. బూతులు లేని జోకులతో నవ్వించడం చాలా కష్టమని సుభాషితం చెప్పిన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)
తను మాత్రం సినిమాల్లో చక్కగా బూతులను వాడవచ్చు. మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న గుంటూరుకారం సినిమా(Guntur Kaaram Movie)లో ఈ పని చేశాడు మాటల మాంత్రికుడన్న పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్.
బూతులతో ఎదుటివాళ్లను నవ్వించడం ఈజీ.. బూతులు లేని జోకులతో నవ్వించడం చాలా కష్టమని సుభాషితం చెప్పిన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తను మాత్రం సినిమాల్లో చక్కగా బూతులను వాడవచ్చు. మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న గుంటూరుకారం సినిమా(Guntur Kaaram Movie)లో ఈ పని చేశాడు మాటల మాంత్రికుడన్న పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్. ఇది పక్కా మాస్ సినిమా అని అందరూ అనుకుంటున్నారు కానీ మరీ ఇంత మాసా అని ఇప్పుడు నొసలు చిట్లించుకుంటున్నారు. గుంటూరుకారం సినిమా నుంచి ఓ మాస్ సాంగ్ బిట్‌ను వదిలారు. అందులో కుర్చీ మడతపెట్టి అనే పద ప్రయోగాన్ని వాడారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన బూతు పదం అది. అది ఎంత పచ్చి బూతో సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లందరికీ తెలుసు. ఇలాంటి బూతు పదం సోషల్ మీడియాలో వస్తేనే కంపరంగా ఉంటుంది. పోన్లే అని అడ్జెస్ట్ అవ్వొచ్చు. కానీ సినిమాల్లో ఆ బూతుపదం వస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది. పైగా ఆ పదాన్ని తీసుకొచ్చి మహేశ్‌బాబు వంటి స్టార్ హీరో సినిమాలో పెట్టడం మరీ జుగుప్సాకరం. దీన్ని మహేశ్‌బాబు ఎలా ఒప్పుకున్నాడన్నదే పెద్ద డౌటు! ఫ్యామిలీస్‌లో మహేశ్‌బాబు అంటే సదాభిప్రాయం ఉంది. కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో మహేశ్ నటిస్తాడనే నమ్మకం కూడా ఉంది. కనీసం అలాంటి అభిమానులను దృష్టిలో పెట్టుకుని అయినా మహేశ్‌బాబు ఈ పదాన్ని వాడకుండా ఉండాల్సింది. నిజానికి తన సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మహేశ్ పట్టించుకుంటాడు. మరి దీన్ని ఎలా మిస్సయ్యాడు?