ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ.

Baby Movie Producer Gift To Sai Rajesh
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్(Sai Rajesh) డైరెక్ట్ చేసిన ఈసినిమాను శ్రీనివాస కుమార్ (SKN) నిర్మించాడు. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధించింది. దాదాపుగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
ఈ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్(Cult Blockbuster) మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబి. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల అప్రిషియేషన్స్ అందుకుంది బేబి సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సాయి రాజేశ్. బాక్సాఫీస్ దగ్గర 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుందీ మూవీ. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్ కు బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్.
బేబి సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేశ్ కు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్...బేబి సక్సెస్ సంతోషంలో బెంజ్ కారు బహుమతిగా అందించారు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్. బేబి మూవీ సక్సెస్ వాళ్ల స్నేహానికి, ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకానికి, సినిమా మేకింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కు తగిన సక్సెస్ అందించింది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన బేబి మూవీ ఓటీటీలోనూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. సాయి రాజేష్ తన నెక్స్ట్ సినిమా కూడా ఎస్ .కే.ఎన్ తోనే చేస్తున్నాడు.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.
