మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి(baby) మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్లింది. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.90 కోట్ల మార్కును దాటేసింది.
మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి(baby) మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్లింది. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.90 కోట్ల మార్కును దాటేసింది. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఆ నమ్మకమే నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది.
ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaithanya), విరాజ్(Viraj) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్(Sai Rajesh) దర్శకుడు. ఇప్పుడున్న జెనరేషన్‌లో లవ్(Love) అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనే విధంగా సినిమాను తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ కాలేజీ కుర్రకారుతో పాటు ఆటో మాస్ జనాలు రిపీటెడ్ షోలు వేసి అరవీర భయంకర హిట్‌ను చేసేశారు. ఇక డిస్ట్రిబ్యూటర్‌లు సైతం ఈ మధ్య కాలంలో ఇంత లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏది లేదని తెగేసి చెప్పారు. నెల కిందట ఓటీటీలో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకుంది.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాను తమిళ్‌లో(Tamil) రీమేక్(Remake) చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాకుండా ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సాయి రాజేషే తమిళ రీమేక్‌ను కూడా తెరకెక్కించబోతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. SKNతో కలిసి ఓ తమిళ మీడియా సంస్థ ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.