ఈసారి బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 7 భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి హౌస్ లోకి..ఎవరూ ఊహించనిక కాండెట్లను తీసుకురావాలి అని చూస్తున్నాడు బిగ్ బాస్ టీమ్. ఈక్రమంలో బిగ్ బాస్ లోకి బేబీ(Baby) హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఈసారి బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 7 భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి హౌస్ లోకి..ఎవరూ ఊహించనిక కాండెట్లను తీసుకురావాలి అని చూస్తున్నాడు బిగ్ బాస్ టీమ్. ఈక్రమంలో బిగ్ బాస్ లోకి బేబీ(Baby) హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి రంగం రెడీ అయ్యింది. ఇప్పటికే రెండు ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. దాదాపు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ముగిసిందట. బిగ్ బాస్ సీజన్ 6 డిజాస్టర్ అవ్వడంతో.. సీజన్ 7న గట్టిగా ప్లాన్ చేశారట మేకరస్. అంతే కాదు కాస్త ఎకమకువైనా మంచి సెలబ్రిటీలను తీసుకుని.. ఆటాడేసుకోవాలని అనుకుంటున్నారట టీమ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల పేర్లతో కూడిన లిస్ట్ బయటకు వచ్చింది. వైరల్అవుతుంది. అందులో కొంత మంది హింట్లు కూడా ఇచ్చేశారు. మరికొంత మంది మాత్రం సీక్రేట్ మెయింటేన్ చేస్తున్నారు.

ఇప్పటికి వినిపిస్తున్న పేర్లలో జబర్థస్త్ వర్ష(Jabardasth Varsha), అమర్ దీప్ చౌదరి(Amardeep chowdhary), ఆయన భార్య తేజస్విని(Tejaswini), శోభిత శెట్టి(shobitha shetty), సింగర్ మోహన భోగరాజు(Mohan Bhogaraju), దీపికా పిల్లి(Deepika pilli), బ్యాంకాక్ పిల్ల(Bangkok Pilli) ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అటు జబర్థస్త్ వర్ష మాత్రం త్వరలో ఓ పెద్ద షోలో పార్టీస్పేట్ చేయబోతున్నట్టు నోరు జారింది. అంతే కాదు బ్యాంకాక్ పిల్ల కూడా ఇండియాకు వచ్చింది. బిగ్ బాస్ కోసం కాదు అని చెప్పినా.. ఆమె కూడా కన్ ఫామ్ అని తెలుస్తోంది.

అయితే బ్రేకింగ్ ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేయడం కోసం బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya) కూడా ఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్ కాక రేపుతోంది. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. బేబీ మూవీతో టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది. ఏక కాలంలో ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడిపే అమ్మాయి పాత్ర చేసింది. అభ్యంతరకర సన్నివేశాల్లో నటించింది. బేబీ మూవీతో వైష్ణవికి బోల్డ్ ఇమేజ్ వచ్చింది.

కాబట్టి వైష్ణవి హౌస్లో అడుగుపెడితే రచ్చ రచ్చే. ఆడియన్స్ ఆమె నుండి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు. అది మేకర్స్ కి చాలా ప్లస్ అవుతుంది. అయితే సూపర్ హిట్ తో ఫార్మ్ లోకి వచ్చిన వైష్ణవి బిగ్ బాస్ హౌస్లోకి వెళుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అలాగే వైష్ణవికి బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఎలాంటి ఆఫర్ లేదని అంటున్నారు. నిజంగా వైష్ణవి బిగ్ బాస్ షోకి ఎంపికైతే నిర్వాహకులకు చాలా ప్లస్. ఆమె కారణం ఆడియన్స్ షో పట్ల ఆసక్తి చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే వైష్ణవి బిగ్ బాస్ కి వెళుతున్నారని అధికారిక సమాచారం లేదు. కేవలం ఊహాగానాలు మాత్రమే. మరి చివరకు ఏమౌతుందో చూడాలి.

Updated On 25 July 2023 12:17 AM GMT
Ehatv

Ehatv

Next Story