బేబీ(Baby) సినిమా సూపర్‌డూపర్‌ హిట్టు కొట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya) పేరు వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమె ట్రెండింగ్‌లో ఉంది. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌ కావాలని, సక్సెస్‌ను చవిచూడలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది వైష్ణవి చైతన్య.

బేబీ(Baby) సినిమా సూపర్‌డూపర్‌ హిట్టు కొట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya) పేరు వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమె ట్రెండింగ్‌లో ఉంది. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌ కావాలని, సక్సెస్‌ను చవిచూడలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది వైష్ణవి చైతన్య. ఎనిమిదేళ్లుగా శ్రమిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. నిరాశ చెందకుండా యూ ట్యూబర్‌గా మారారు. పలు షార్ట్‌ ఫిలిమ్స్‌(Shortfilms) తీసుకుంటూ, ఇన్‌స్టాలో రీల్స్‌(Instagram Reels) చేసుకుంటూ వస్తోంది. ఓ శుభ ముహూర్తాన డైరెక్టర్‌ సాయి రాజేశ్‌(Director Sai Rajesh) ఆమెను పిలిచి బేబీలో అవకాశం ఇచ్చారు.

అలా ఆమె సిల్వర్‌ స్క్రీన్‌పై తళుక్కుమని మెరిసింది. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్‌ చెప్పినప్పుడు సంతోషంగా ఎగిరి గంతేశానని వైష్ణవి చైతన్య ఇంతకు ముందే చెప్పింది. తాను కూడా చంద్రాయణగుట్టలోని ఓ బస్తీ అమ్మాయినేనని తెలిపింది. బేబీ విజయవంతం కావడంతో ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రముఖ సంస్థ అయిన గీతా ఆర్ట్స్‌లో(Geetha Arts) సినిమా ఛాన్స్‌ వచ్చింది.

ఇందుకు సంబంధించి తనను అల్లు అరవింద్‌(Allu Arvindh) సంప్రదించినట్టు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన కథ కూడా తన దగ్గర ఉందని, అది కూడా ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ అని బేబీ సక్సెస్‌ మీట్‌లోనే అల్లు అరవింద్‌ కొన్ని వివరాలు చెప్పుకొచ్చారు. మరోవైపు అల్లు శిరీష్‌(Allu sirish)- వైష్ణవి హీరో హీరోయిన్లుగా మరో కథతో కూడా ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారట. అల్లు అర్జున్‌(allu arjun) కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చారు. మొత్తంమీద అల్లు కుటుంబం నుంచి వైష్ణవి చైతన్యకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఏదో ఒక ప్రాజెక్టులో గీతా ఆర్ట్స్‌ ద్వారా చక్కటి సినిమా రావచ్చని వైష్ణవి చైతన్య అనుకుంటోంది.

Updated On 24 July 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story