చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి సరసన ఇప్పుడు బేబీ(Baby) నిలిచింది. అసలు ఈ సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని ఎవరూ ఊహించలేదు. మేకర్స్‌ కూడా అనుకున్నారో లేదో తెలియదు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి సరసన ఇప్పుడు బేబీ(Baby) నిలిచింది. అసలు ఈ సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని ఎవరూ ఊహించలేదు. మేకర్స్‌ కూడా అనుకున్నారో లేదో తెలియదు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సాయి రాజేశ్‌(Sai Rajesh) దర్శకత్వం వహించారు. ఆనంద్‌ దేవరకొండ(Anand Devarkonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Devarkonda), విరాజ్‌ అశ్విన్‌లు(Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మౌత్‌టాక్‌తోనే సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 70 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. ఇప్పుడు బేబీ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కన్నడ స్టార్‌ యశ్‌(Yash) నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ కేజీఎఫ్‌-2(KGF-2) రికార్డును బద్దలు కొట్టింది. ఆశ్చర్యపోకండి.. ఇది నిజంగానే నిజం. గతంలో కేజీఎఫ్‌-2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు కోటి రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బేబీ సినిమా వరుసగా 13 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లను సాధించి కేజీఎఫ్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్ల పరంగా ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం అర్జున్ రెడ్డి కలెక్షన్లను దాటేసిన బేబీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను సాధిస్తుందో చూడాలి..

Updated On 28 July 2023 6:33 AM GMT
Ehatv

Ehatv

Next Story