ఆదిపురుష్‌ సినిమా ఆడే థియేటర్లలో ఓ సీటు ఖాళీగా ఉంచుతామని మేకర్స్‌ ప్రకటించారు. ఆ కుర్చీ హనుమంతుడికి కేటాయిస్తున్నట్టు కూడా చెప్పారు. ఇదో రకమైన పబ్లిసిటీ అని చాలామంది విమర్శలు కూడా చేశారు. భక్తిని క్యాష్‌ చసుకోవడంలో ఇదో భాగం. ఇది ఇప్పుడు మొదలయ్యింది కాదు. 1943లో వచ్చిన వాహినీ వారి భక్త పోతన నుంచే మొదలయ్యింది. చాలా భక్తి సినిమాలకు ఇలాగే ప్రచారం చేసుకున్నారు. ఇదే విషయంపై గోగినేని బాబు చాలా ప్రశ్నలు లేవనెత్తారు.

1. సినిమా హాల్‌ను గుడిగా మార్చడానికి పర్మిషన్ ఉందా? అక్కడ భక్తులకు కొబ్బరికాయలు కొట్టే సదుపాయం ఏర్పాటు చేశారా?
2.ప్రదర్శనశాల గుడిగా మారితే, భక్తులు పూజలు చేసుకోవాలంటే కంచు గంటలూ, భక్తులు ఆశీర్వాదం పొందడానికి ఒక దేశీ ఆవూ, సరైన కులం నుండి ఒక పూజారీ, హల్ లో నిత్యాన్నదానం కోసం హుండీలూ ఉండాలి కదా?
3. పరమతస్తులు సినిమా చూడాలంటే టిక్కెట్ కొనే ముందు రిజిస్టర్ లో సంతకం పెట్టాలి కదా? రిజిస్టర్ లు పెట్టారా?
4. అలాగే, థియేటర్ లో అప్రాచ్యపు యురోపియన్ల చిప్స్, మెక్సికన్ల పాప్కార్న్, అమెరికన్ల బర్గర్లు, కోకులు అమ్మవచ్చా? అమ్మే వాళ్ళ మతాలు, కులాలు తెలుసుకున్నారా?
5.నిజానికి నిర్మాతలు ప్రసాదం ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలి కదా? చేస్తున్నారా?
6. బహిష్టులో ఉన్న ఆడవారు బ్రహ్మచారులు ఉన్న సినిమా హాల్ లోకి, లేక సినిమా ప్రదర్శిస్తున్న గుడులలోకి ప్రవేశించవచ్చునా?
7. ఏది ఏమైనా, నియమం ప్రకారం మగవాళ్ళు చొక్కా లేకుండా, ఎవరు కూడా లోనికి తోలు వస్తువులు తీసుకురాకుండా, తోలు బెల్టులు లాంటివి ధరించకుండా, చెప్పులు లేకుండా లోనికి వెళ్ళాలి కదా?
8.రాహు కాలం లో షో ఉంటే ఏమి చేయాలి? హాలు వాస్తు ప్రకారం లేకపోతే రెమెడీ ఎవరు ఇవ్వాలి?
9.తూర్పు కు దండం పెట్టుకోవాలంటే, లేదూ సేతువు ఎటు వైపు ఉందో చూపించే దిక్సూచి ప్రతి హాల్ లో ఉంటుందా?
ఈ ప్రశ్నలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు గోగినేని బాబు. మరి దీనికి సినిమా యూనిట్‌ జవాబులిచ్చే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది చూడాలి.

Updated On 9 Jun 2023 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story