బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్లో హీరోయిన్గా పేరు తెచ్చుకుని వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజిబిజిగా గడుపుతోంది. అయితే ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. అదేంటంటే ఆమె దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ (Emergency 2023) సినిమా గురించి పోస్ట్ చేసింది.

Kangana Ranaut
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్లో హీరోయిన్గా పేరు తెచ్చుకుని వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజిబిజిగా గడుపుతోంది. అయితే ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. అదేంటంటే ఆమె దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ (Emergency 2023) సినిమా గురించి పోస్ట్ చేసింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలిపింది. అయితే ఈ చిత్రాన్ని మొదటి సారిగా చూసిన వ్యక్తి రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) అని ఆమె తెలియజేశారు.
సినిమా చూస్తున్నంత సేపు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని.. సినిమా మొత్తం అయిపోయాక.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని తనను ప్రశంసించారని కంగనా రనౌత్ చెప్పింది. ఆయన నాపై ప్రశంసలు కురిపించారని.. నా జీవితానికి ఇది చాలని సోషల్ మీడియా వేదికపై తెలిపింది. నా గురువులు, శ్రేయోభిలాషులతో కలిసి చేసిన ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉందని ఆమె అన్నారు. ఇక విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రచించిన మణికర్ణిక సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను దేశంలో ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర అంశంతో ఎమర్జెన్సీ (Emergency 2023) సినిమాను డైరెక్ట్ చేసింది కంగనా రనౌత్ (Kangana Ranaut). ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ (Indira Gandhi) క్యారెక్టర్లో మనకు కనిపించబోతోంది.
