టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి-2 (Baahubali 2: The Conclusion). ఈ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడే ఆరేళ్లు పూర్తి అవుతుంది.

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి-2 (Baahubali 2: The Conclusion). ఈ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడే ఆరేళ్లు పూర్తి అవుతుంది.

తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమాలు ఏవంటే వెంటనే బాహుబలి గుర్తుకు వస్తుంది. ఈసినిమాతో రాజమౌళి.. దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కడం కాదు.. టాలీవుడ్‏ను ఓ పది మెట్లు ఎక్కించాడు. జక్కన్న ఈసినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి-2 కూడా వచ్చి.. ఆ క్రేజ్‏ను డబుల్ చేసింది.

ఇండియన్ బాక్సాఫీస్‏ను శేక్ చేసిన బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఆరేళ్లు పూర్తవుతుంది. ఇక ఇప్పటికీ అదే క్రేజ్‏తో ఉన్నఈసినిమా ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. బాహుబలి ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా రికార్డ్స్‏ను ఎవరూ బ్రేక్ చేయలేదు.. మరి ఈ రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేస్తారా అని చూస్తున్నారు. ఇక బాహుబలితో.. ప్రభాస్ అనుష్కా (Anushka)తో పాటు.. రానా దగ్గుబాటి (Rana Daggubati), తమన్నా (Tamanna), సత్యరాజ్ నాజర్ లాంటి ప్రముఖులు నటించారు.

బాలీవుడ్‏కు కాస్తో కూస్తో ఉన్న పొగరు ఈ సినిమాతో తీసేశాడు రాజమౌళి (Rajamouli). సౌత్ సినిమా అంటే చీప్‏గా చూసేవారికి సౌత్ సినిమా పవర్ ఏంటో చూపించారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్‏లో (Bollywood) పస అయిపోయింది నిరాశలో కొట్టుకోవడానికి కారణం కూడా జక్కన్న వేసిన బాహుబలి అనే గట్టి విత్తనమే. . ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా జక్కన్న తెరకెక్కించడంతో ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు పట్టం కట్టారు. అప్పటివరకు తెలుగు సినిమా అంటే ఓ ప్రాంతీయ సినిమాగా చూసిన నార్త్ ఆడియెన్స్, బాహుబలి దెబ్బకు దాసోహం అన్నారు.

బాహుబలి2 ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అన్ని భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ సినిమాల రికార్డులను అలవోకగా పక్కక్కు తప్పించేసింది. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అంతర్జాతీయంగా బాహుబలి-2 మూవీ తన సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది.

Updated On 29 April 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story