బాగా ఏడిపించేశారుగా.. అకౌంట్ డిలీట్ చేసిన సూపర్ భామ
అయేషా టాకియా.. బాలీవుడ్ లో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ను అందుకుంది ఈ భామ. తెలుగులో సూపర్ సినిమాలో నటించింది
అయేషా టాకియా.. బాలీవుడ్ లో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ను అందుకుంది ఈ భామ. తెలుగులో సూపర్ సినిమాలో నటించింది. సల్మాన్ ఖాన్ సరసన పోకిరి రీమేక్ 'వాంటెడ్' లో నటించింది అయేషా. నటి అయేషా టాకియా ఓ పార్టీలో ఫోటోలు దిగింది.. అయితే ఆ ఫోటోలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. కొన్ని రోజుల క్రితం అయేషా అందమైన నీలిరంగు కంజీవరం చీరలో తన ఫోటోను షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించిన ఈ ఫోటోలో 'వాంటెడ్' నటిని కనీసం గుర్తు పట్టలేకపోయామని నెటిజన్లు చెప్పుకొచ్చారు.
2009లో ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకున్న తర్వాత అయేషా నటనకు స్వస్తి చెప్పింది. ఆయేషా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఫల్గుణి పాఠక్ పాట 'మేరీ చునార్ ఉడ్ ఉడ్ జాయే'తో తన దృష్టిని ఆకర్షించింది. తర్వాత ఆమె 'టార్జాన్: ది వండర్ కార్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2004లో ఉత్తమ అరంగేట్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.