‘అవతార్’ (Avatar) సినిమా భారీ విజయాన్ని సంపాదించింది, ఆ తర్వాత వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) కూడా వరల్డ్ వైడ్‌గా ఫిల్మ్ లవర్స్‌కు మంచి ఎక్స్ పీరియన్స్‌ను ఇచ్చింది. జేమ్స్ కామెరాన్ (James Cameron) దర్శకత్వం వహించిన ఈ రెండు భాగాలు ఎవరూ ఊహించని సక్సెస్‌ను ఇచ్చాయి. ఆడియన్స్‌ను ఓ మూడు గంటలు పాండోరా గ్రహం మీద తిప్పి మంత్రముగ్ధులను చేశారు ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్.
‘అవతార్’ (Avatar) సినిమా భారీ విజయాన్ని సంపాదించింది, ఆ తర్వాత వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) కూడా వరల్డ్ వైడ్‌గా ఫిల్మ్ లవర్స్‌కు మంచి ఎక్స్ పీరియన్స్‌ను ఇచ్చింది. జేమ్స్ కామెరాన్ (James Cameron) దర్శకత్వం వహించిన ఈ రెండు భాగాలు ఎవరూ ఊహించని సక్సెస్‌ను ఇచ్చాయి. ఆడియన్స్‌ను ఓ మూడు గంటలు పాండోరా గ్రహం మీద తిప్పి మంత్రముగ్ధులను చేశారు ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్. అయితే ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నట్టే అవతార్ 3 కూడా మన ముందుకు వచ్చే ఏడాది రాబోతోంది. ఇందుకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా ఒచ్చేశాయి.
అవతార్ 3 చిత్రం వచ్చే ఏడాది అంటే 2024 డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి జేమ్స్ కామరూన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అవతార్ చిత్రం 2026 డిసెంబర్ 18న, అవతార్ 5 చిత్రం 2028 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే అవతార్ 3 (Avatar3) అంతా కూడా అవతార్: ది వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water) మీదే ఆధారపడి ఉంటుందట. అందుకు సంబంధించిన షూటింగ్ మొత్తం వచ్చే ఏడాదిలోనే ప్లాన్ చేయనున్నారు.
ఇక అవతార్ 3 కాస్ట్ విషయానికి వస్తే.. మెయిన్ క్యారెక్టర్‌తో పాటు మరికొందరు కొత్త క్యారెక్టర్లు పరిచయం కానున్నారు. అవతార్ 3 లో జాక్ సులీ, కల్నల్ స్టీఫెన్ లాంగ్, మైల్స్ క్వారిచ్, సిగోర్నీ వీవర్ (కిరి), జోయ్ సాల్దానా (నెటిరి) ఉన్నారు. ఇక డేవిడ్ థెవ్లిస్, మిచెల్ యెహ్లు అవతార్ 3లో కొత్తగా పరిచయం కాబోతున్నారు. అవన్నీ ఒకెత్తయితే అవతార్ 4, అవతార్ 5 లో మెయిన్ కాస్ట్ తప్పించి మిగతా అంతా కూడా కొత్త వాళ్లే ఉండేలా తెలుస్తోంది.
అవతార్ 3 గురించి డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఏమంటున్నారంటే.. ఈ చిత్రంలో పాండోరా మీద నావి అనే కొత్త గ్రూప్‌ను పరిచయం చేయబోతున్నట్టు ఆయన చెప్తున్నారు. వీళ్లని ‘ఆష్ పీపుల్’ (Ash People) అని పిలుస్తారట. ఈ గ్రూప్ అగ్ని (Fire)తో కనెక్ట్ అవుతారట. అయితే అవతార్ 3లో కూడా మానవత్వం వైపు నడిచేవిధంగా ఆ జాతి వారు ఉంటారని అంటున్నారు జేమ్స్. సినిమా ప్రారంభం నుంచే అన్వేషణలోకి మూవ్ అవుతూ పాండోరా మీదకు వెళ్తామట. పాండోరాలో యాంటోగనిస్టు పర్సనల్ థ్రెట్ ఉంటుందని డైరెక్టర్ అంటున్నారు. అవతార్ 3లో కూడా ఫేస్ లెస్ యంత్రాలు కూడా ఉండబోతున్నాయట. అదలా ఉంటే ఈ వార్త విన్నాక ఆవతార్ ఫ్రాంచైజ్ చూసేందుకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నామంటున్నారు ఆడియన్స్.