టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 41వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ స్టార్ హీరోకు సాధారణంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. పుష్ప (Pushpa) సినిమా తర్వాత ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్‌గా కూడా మంచి ఫేమ్ క్రియేట్ చేసింది.

david warner birthday wished to allu arjun
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 41వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ స్టార్ హీరోకు సాధారణంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. పుష్ప (Pushpa) సినిమా తర్వాత ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్‌గా కూడా మంచి ఫేమ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David warner) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. బ్రౌన్ కలర్ టీ షర్ట్ ధరించి.. బ్లూ కలర్ హ్యాట్‌తో అల్లు అర్జున్‌కు ‘బిగ్ హ్యాపీ బర్త్ డే’ (Big Birthday) అని విషెస్ చెస్తూ.. పుష్పా తగ్గేలే డైలాగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ.. తన కూతురితోనూ బర్త్ డే విషెస్ చెప్పించాడు డేవిడ్ వార్నర్ (David warner).
ఈ వీడియోలో పుష్ప: ది రూల్ (Pushpa:The Rule) కోసం ఎదురు చూస్తున్నామంటున్నామంటూ చెప్పాడు వార్నర్. ఇక పుష్ప2కి సంబంధించిన ఒక పోస్టర్‌ను మూవీ టీమ్ శుక్రవారం విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్ (Allu Arjun) చీర కట్టుకుని, ముఖానికి నీలం, ఎరుపు షేడ్స్తోపాటు మెడలో నిమ్మకాలతో కనిపిస్తున్నాడు.
డేవిడ్ వార్నర్ (David warner) తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు డేవిడ్ వార్నర్ (David warner) ఫ్యాన్స్ క్రేజీ కమెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్లో బిజిబిజీగా ఉన్నారు.