ఎదురుచూసిన శుభగడియ వచ్చేసింది. అజానుబాహుడైన శ్రీరాముడిగా ప్రభాస్‌(prabhas) కనువిందు చేశాడు. ఆగమనం.. అధర్మ విధ్వంసం అంటూ జగదభిరాముడిగా(Lord Rama) ప్రభాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఆదిపురుష్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చింది.

ఎదురుచూసిన శుభగడియ వచ్చేసింది. అజానుబాహుడైన శ్రీరాముడిగా ప్రభాస్‌(prabhas) కనువిందు చేశాడు. ఆగమనం.. అధర్మ విధ్వంసం అంటూ జగదభిరాముడిగా(Lord Rama) ప్రభాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఆదిపురుష్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌(Adipurush) ఆడుతున్న ఓ సినిమా థియేటర్‌లో ఓ చిత్రమైన సంఘటన జరిగింది. అనుకోని అతిథి సినిమా చూసేందుకు రావడంతో ప్రేక్షకులు అబ్బురపోయారు. దైవలీలేనని అనుకుంటున్నారు.

ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రయూనిట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కదా! రామాయణ(Ramayanam) పారాయణం జరిగే ప్రతి చోటుకు హనుమంతుడు(Lord Hanuma) వస్తాడన్నది కదా మన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఒక కుర్చీ ఆ హనుమంతుడి కోస ఖాళీగా పెట్టారు. అయితే ఆదిపురుష్‌ సినిమా ఆడుతున్నప్పుడు ఓ థియేటర్‌లో అనుకోకుడా ఓ వానరం(Monkey) ప్రవేశించింది.

కాసేపు ఆదిపురుష్‌ సినిమాను చూసింది. దీంతో థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులంతా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇదిచూసిన వారంతా అద్భుతమని, దైవలీల అని కామెంట్స్‌ చేస్తున్నారు. సాక్షాత్తూ ఆంజనేయ స్వామినే వచ్చి సినిమా చూశాడని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్‌ సినిమాకు మంచి స్పందన వచ్చింది. రామాయణ గాధకు ఆధునిక టెక్నాలజీని జోడించి తీసిన సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated On 16 Jun 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story