మోహన్‌బాబుపై హత్యా యత్నం కేసు!

రిపోర్టర్‌పై నటుడు మోహన్‌బాబు (Mohan Babu) దాడి కేసులో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మోహన్‌బాబుపై పహాడీషరీఫ్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మొదట మోహన్ బాబుపై బీఎన్‌ఎస్‌ 118(1) సెక్షన్‌ కింద కేసు నమోదుచేశారు. అయితే లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న పోలీసులు.. దానిని హత్యాయత్నం కేసుగా మార్చారు. 109 సెక్షన్‌ కింద కేసు రిజిస్టర్‌ చేశారు.కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు మంగళవారం వెళితే మోహన్‌బాబుతోపాటు బౌన్సర్ల, సహాయకులు.. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేశారు. కర్రలతో కొట్టారు. ఓ చానల్‌ ప్రతినిధి చేతిలో ఉన్న మైక్‌ను మోహన్ బాబు.గుంజుకొని ఆయన ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఆ చానల్‌ కెమెరామెన్‌ కింద పడ్డారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు మనోజ్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మేనేజర్‌ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడిగా ఉన్న వినయ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.

ehatv

ehatv

Next Story