పాకిస్తాన్‌తో(pakistan) జరిగిన ఆసియా కప్‌(Aisa Cup 2023) మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీతో(Virat Kohli) పాటు కె.ఎల్‌.రాహుల్‌(KL Rahul) కూడా సెంచరీ బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి అతియా షెట్టి(Athiya Shetty) తన భర్త కె.ఎల్‌.రాహుల్‌ను అభినందించారు.

పాకిస్తాన్‌తో(pakistan) జరిగిన ఆసియా కప్‌(Aisa Cup 2023) మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీతో(Virat Kohli) పాటు కె.ఎల్‌.రాహుల్‌(KL Rahul) కూడా సెంచరీ బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి అతియా షెట్టి(Athiya Shetty) తన భర్త కె.ఎల్‌.రాహుల్‌ను అభినందించారు. చాలా రోజులుగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రాహుల్‌కు పాక్‌తో జరిగిన మ్యాచ్‌ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. జట్టులో ఛాన్స్‌ దొరకడం కష్టమేనని అనుకున్న సమయంలో రాహుల్‌ తన సత్తా చాటుకున్నాడు. పాక్‌పై సెంచరీ సాధించాడు. తాజాగా అతియా శెట్టి తన జీవిత భాగస్వామి అయిన కేఎల్‌ రాహూల్‌ ఆటతీరుపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రశంసించారు.'చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, నేను నిన్ను ఆరాధిస్తాను.

హ్యష్‌టాగ్‌ వన్‌ (#1).' అని అతియా షెట్టి పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ చేసిన వెంటనే రాహుల్‌ అభిమానులు రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన నటుడు అనిల్ కపూర్(Anil Kapoor),వాణి కపూర్(Vani Kapoor) ప్రతిస్పందిస్తూ క్లాప్ ఎమోజీలతో రాహుల్‌ను అభినందించారు. ఆపై వెంటనే బాలీవుడ్‌ యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shrof) కూడా రెడ్‌ హార్ట్‌ ఎమోజీలతో స్పందించాడు. డ్రీమ్ గర్ల్ 2 ఫేమ్ ఆయుష్మాన్ ఖురానా 'వాట్‌ ఏ కంబ్యాక్' అంటూ రాశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ షెట్టి కూతురు అతియా షెట్టి టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌తో చాలాకాలం డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాదే వీరిద్దరు వివాహం చేసుకున్నారు. సూరజ్‌ పంచోలీ హీరోగా వచ్చిన హీరో సినిమాతో అతియా సినీరంగంలో అడుగుపెట్టారు. ఆమె చివరి సారిగా మోతీచూర్ చక్నాచూర్ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ సరసన నటించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ హోప్ సోలోలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

Updated On 12 Sep 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story