బాలకృష్ణకు ఫ్యాన్స్ ఉన్నారు అలాగే యాంటీఫ్యాన్స్  కూడా ఉన్నారు. సినీ స్టార్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఒక అర్ధం ఉంటుంది. కానీ వాళ్ల పిల్లలకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మొన్నామధ్య ఓ ఇద్దరు స్టార్ హీరోల పిల్లల కోసం పే....ద్ద వారే జరిగింది సోషల్ మీడియాలో. అదలా ఉంటే పలు సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు వేణుస్వామి. తాజాగా ఆయన నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ భవిష్యత్తుపై సంచలన కమెంట్స్ […]

బాలకృష్ణకు ఫ్యాన్స్ ఉన్నారు అలాగే యాంటీఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినీ స్టార్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఒక అర్ధం ఉంటుంది. కానీ వాళ్ల పిల్లలకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మొన్నామధ్య ఓ ఇద్దరు స్టార్ హీరోల పిల్లల కోసం పే....ద్ద వారే జరిగింది సోషల్ మీడియాలో. అదలా ఉంటే పలు సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు వేణుస్వామి.

తాజాగా ఆయన నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ భవిష్యత్తుపై సంచలన కమెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణుస్వామి. అయితే గత కొన్నినెలలుగా నటసింహం బాలయ్య కుమారుడి సినీ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున జనాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఎంట్రీ పక్కా అంటున్నారే గాని.. మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటనలు రావడం లేదు.

మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఉంటుందా అని చాలా మంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ మూవీకి హీరో బాలకృష్ణ దర్శకత్వం వహిస్తారని, అదే మూవీలో బాలయ్య బాబు ఓ కీలక పాత్ర చేస్తారని న్యూస్ స్ప్రెడ్ చేశారు. ‘ఆదిత్య369’కి సీక్వెల్ గా ‘ఆదిత్య999’ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తారని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా ఆయన మాత్రం ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెడతారనేది క్లారిటీ లేదు.

ఇలాంటి పరిస్థితుల మధ్య జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కమెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుంది కానీ.. అది చాలా లేట్ గా ఉంటుందని, తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోగా ఎదురుతారని చెప్పారు. సినీ రంగంలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్తు ఉందని జ్యోష్యం చెప్పారు.

అయితే మోక్షజ్ఞ ఫ్యామిలీలో కేవలం ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా రాజకీయం కూడా ఉంది కాబట్టి, మోక్షజ్ఞ తేజ రాజకీయాల్లో వెళ్లితే ఆయన ఫ్యూచర్ అంత బాగోదని సంచలన కమెంట్స్ చేశారు జ్యోతిష్యుడు. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వడని బలంగా చెప్పారు. సినిమాలే మోక్షజ్ఞ కు మంచి క్రేజ్ పెంచుతాయని వేణుస్వామి చెప్పాడు.

ఏది ఏమైనా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై క్లారిటీ ఒచ్చినప్పటికీ.. ఆ క్షణం ఎప్పుడు అనేది ఆయోమయంలో పడేస్తోంది నందమూరి ఫ్యాన్స్ ని. మరోవైపు మోక్షజ్ఞ గురించి వేణుస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Updated On 24 Feb 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story