తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో చాలా ఫేమసైన వ్యక్తి వేణుస్వామి. కొన్ని సార్లు వేణుస్వామి చెప్పిన జాతకాలు నిజమవుతుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో చాలా ఫేమసైన వ్యక్తి వేణుస్వామి. కొన్ని సార్లు వేణుస్వామి చెప్పిన జాతకాలు నిజమవుతుంటాయి. కొన్ని వివాదాస్పదమవుతుంటాయి. గతంలో ఇతరుల జాతకాలు చెప్పడంలో బిజీగా ఈయన పండితుడు తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత ..వాళ్లిద్దరు కలిసి ఉండలేరు. పెళ్లి తర్వాత విడిపోతారు అని కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. దీంతో ఆయన కొంత కాలం జాతకాలకు దూరంగా ఉన్నారు. ఇకపై సినిమా, రాజకీయనాయకుల జాతకాలపై వ్యాఖ్యలు చేయను అనిచెప్పారు. తాజాగా పుష్ప-2 సినిమా చూసి వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పుడే పుష్ప సినిమా చూసి వచ్చాను. రాజమాతంగి గెటప్‌లో బ్లూ కలర్ చీరలో జాతర సీన్‌ను అల్లు అర్జున్ ఇరగదీశారు' అని అన్నారు. అల్లు అర్జున్ అసలైన సూపర్‌స్టార్ అంటూ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా తాను గతంలో పలు చానెళ్లకు అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలను వీడియోల్లో చూపించారు. ఇంకో 10-15 ఏళ్లు ఆయనకు తిరుగులేదని.. పానిండియా స్టార్ కాబోతున్నారని.. వందల కోట్లు వసూళ్లు చేస్తాయని.. తాను చెప్పిన వ్యాఖ్యలను వీడియోల్లో చూపించారు.