సంచలనాలకు మారుపేరు అనాలో, వివాదాస్పద జ్యోతిష్యుడు అనాలో తెలియదు కానీ వేణుస్వామికి మాత్రం ఎవరికీ రానంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

సంచలనాలకు మారుపేరు అనాలో, వివాదాస్పద జ్యోతిష్యుడు అనాలో తెలియదు కానీ వేణుస్వామి(Venu Swamy)కి మాత్రం ఎవరికీ రానంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. చాలా మంది సెలెబ్రెటీల వివాహాలపై, రాజకీయ ప్రముఖుల భవిష్యత్తుపై ఈయన చెప్పిన జోస్యాలు దాదాపుగా నిజాలయ్యాయి. అంతెందుకు నాగచైతన్య(Naga Chaitanya)- సమంత(Samantha) ఎంగేజ్‌మెంట్‌ అప్పుడే వీరి వివాహబంధం ఎక్కువ రోజులు ఉండదని చెప్పారు. ఆయన చెప్పినట్టే వారు విడాకులు తీసుకున్నారు. ఇవాళ నాగచైతన్య, శోభిత దూళిపాళ నిశ్చితార్థం(Naga Chaitanya Sobhita Dhulipala Engaged) జరిగింది. వీరి వివాహ జీవితం ఎలా ఉంటుందో రేపు ప్రకటిస్తానని వేణుస్వామి చెప్పడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ వాట్సప్‌ స్టేటస్‌తో వేణుస్వామి సోషల్ మీడియా(Social Media)లో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చారు.

నటి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. కాకపోతే వారిద్దరూ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడూ తమ ప్రేమ గురించి చెప్పలేదు. సడన్‌గా వారిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. గురువారం వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వార్తలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని తాను చెబుతానంటూ వేణుస్వామి ప్రకటన చేసి సంచలనం రేపారు. తన వాట్సప్‌ స్టేటస్‌లో ఓ ప్రకటన చేశారు. 'నాగచైతన్య, శోభిత దూళిపాల వైవాహిక జీవితంపై సంచలనాత్మకమైన జాతకరపరమైన విశ్లేషణ రేపు' అని చెప్పారు. ఏం చెప్తారో ఏమో చూడాలి!సంచలనాలకు మారుపేరు అనాలో, వివాదాస్పద జ్యోతిష్యుడు అనాలో తెలియదు కానీ వేణుస్వామికి మాత్రం ఎవరికీ రానంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

Eha Tv

Eha Tv

Next Story