ఎన్టీఆర్‌(NTR).. అసలు మూడక్షరాలలోనే పవర్‌ ఉందని చాలా మంది అనుకుంటుంటారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తాతలాగే మహర్జాతకుడన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రముఖ జ్యోతిష్కుడు(Astrologer) వేణు స్వామి(Venu swamy) మాత్రం ఎన్టీఆర్‌ జాతకాన్ని భిన్నంగా చెబుతున్నారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడంలో వేణుస్వామి ఫేమస్‌ అన్న విషయం తెలిసిందే కదా! ఎన్టీఆర్‌కు రాజయోగం ఉందని చాలా సందర్భాలలో వేణుస్వామి చెప్పారు. లేటెస్ట్‌గా ఆయన చెప్పిన మాటలు మాత్రం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లో టెన్షన్‌ రేపుతున్నాయి. 'తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేను, ఎన్టీఆర్‌ అమ్మగారు షాలిని కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్టీఆర్‌ టాపిక్‌ వచ్చింది.

ఎన్టీఆర్‌(NTR).. అసలు మూడక్షరాలలోనే పవర్‌ ఉందని చాలా మంది అనుకుంటుంటారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తాతలాగే మహర్జాతకుడన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రముఖ జ్యోతిష్కుడు(Astrologer) వేణు స్వామి(Venu swamy) మాత్రం ఎన్టీఆర్‌ జాతకాన్ని భిన్నంగా చెబుతున్నారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడంలో వేణుస్వామి ఫేమస్‌ అన్న విషయం తెలిసిందే కదా! ఎన్టీఆర్‌కు రాజయోగం ఉందని చాలా సందర్భాలలో వేణుస్వామి చెప్పారు. లేటెస్ట్‌గా ఆయన చెప్పిన మాటలు మాత్రం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లో టెన్షన్‌ రేపుతున్నాయి. 'తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేను, ఎన్టీఆర్‌ అమ్మగారు షాలిని కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్టీఆర్‌ టాపిక్‌ వచ్చింది. అప్పటికే చిన్న ఎన్టీఆర్‌ జాతకాన్ని నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. అప్పుడు షాలిని(Shalini) నన్ను ఓ ప్రశ్న అడిగారు. ఎన్టీఆర్‌ పుట్టుక విషయంలో ఓ పెద్ద సమస్య ఉందని, ఆ దోషం తెలియకుండానే తారక్‌ జాతకం అంత కరెక్ట్‌గా ఎలా చెబుతున్నారని ఆమె నన్ను ప్రశ్నించారు. ఆ సమస్య ఏమిటో నాకు తెలుసు తల్లి అని జవాబిచ్చాను. దాంతో పాటు తారక్‌కు ఉన్న జన్మదోషం ఏమిటో చెప్పాను. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఆ దోషం గురించి తనకు, తారక్‌కు, పెద్ద ఎన్టీఆర్‌కు మాత్రమే తెలుసు, నాలుగో వ్యక్తికి తెలియదు. అలాంటిది మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారామె! అప్పుడు నేను నాకు అన్ని విషయాలు తెలుస్తాయమ్మ అని చెప్పాను' అని వేణుస్వామి వివరంగా చెప్పుకొచ్చారు. ఇంత చెప్పారు కానీ అసలు సమస్య ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. ఎన్టీఆర్‌ జన్మ నక్షత్రం మఖ అట! తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితది కూడా మఖ నక్షత్రమేనట! ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, 2030 వరకు తారక్‌ను పాలిటిక్స్‌లోకి(Politics) ఎంటర్‌ కాకుండా చూడండంటూ షాలినికి సలహా ఇచ్చానని వేణుస్వామి చెప్పారు. ఎన్టీఆర్‌కు ఉన్న జన్మదోషమేమిటి? తండ్రి హరికృష్ణకు(Hari Krishna) కూడా తెలియకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారు? పుట్టుకలో ఉన్న దోషం కారణంగా ఎన్టీఆర్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? అన్న సందేహాలు తారక్‌ ఫ్యాన్స్‌ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు.

Updated On 30 Dec 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story