Astrologer Venu Swamy : వేణుస్వామి సినిమాల్లో నటించిన విషయం తెలుసా?
వేణుస్వామి(Venu Swamy) అంటే తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. జ్యోతిష్యంతో(Astrology) చాలా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు! మొన్న తెలంగాణ ఎన్నికలపై(TS Elections) వేణుస్వామి చెప్పిన జోస్యం తలకిందులు అవ్వడంతో వేణుస్వామిపై సోషల్ మీడియాలో(social media) బోల్డన్ని కథనాలు వచ్చాయి. నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను వేణుస్వామి సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు కానీ, గతంలో ఆయన చెప్పినవి దాదాపు కరెక్టయ్యాయి.

Venu Swamy
వేణుస్వామి(Venu Swamy) అంటే తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. జ్యోతిష్యంతో(Astrology) చాలా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు! మొన్న తెలంగాణ ఎన్నికలపై(TS Elections) వేణుస్వామి చెప్పిన జోస్యం తలకిందులు అవ్వడంతో వేణుస్వామిపై సోషల్ మీడియాలో(social media) బోల్డన్ని కథనాలు వచ్చాయి. నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను వేణుస్వామి సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు కానీ, గతంలో ఆయన చెప్పినవి దాదాపు కరెక్టయ్యాయి. అందుకే స్టార్ హీరో హీరోయిన్లు కూడా జాతకం కోసం వేణుస్వామిని సంప్రదిస్తుంటుంటారు. దోషాలను దూరం చేయడానికి స్టార్ హీరోయిన్ల ఇంట్లో పూజలు, యాగాలు కూడా చేశారు. వేణుస్వామి తెలుగు సినిమాల్లో నటించారన్న(Acting) విషయం చాలా మందికి తెలియదు. వేణుస్వామి ఏమిటి? సినిమాల్లో నటించడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే ఆయన నటించారు. జగపతిబాబు(Jagapati Babu) హీరోగా వచ్చిన జగపతి(Jagapati) అనే సినిమాలో వేణుస్వామి కాసేపు అలా కనిపిస్తారు. అది కూడా గుడిలో అర్చకుడి వేషం. ఈ సినిమా 2005లో విడుదలయ్యింది. సినిమా పెద్దగా ఆడలేదు. పైగా అప్పుడు వేణుస్వామి ఎవరనేది తెలియదు. అప్పుడాయన అంత ఫేమస్ కాదు. అందుకే ప్రేక్షకులు వేణుస్వామిని గుర్తుపట్టలేకపోయారు. అలాగే మహేశ్‌బాబు(Maheshbabu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) రూపొందించిన అతడు సినిమాలో కూడా ఓ పాటలో తళుక్కుమని మెరుస్తారు వేణుస్వామి.
