అన్నీ మంచి శకునములే(Ani Manchi Shakunamule) సినిమా ప్రమోషన్‌ ఈవెంట్‌లో చిత్రదర్శకురాలు నందిని రెడ్డి(Nandhini reddy) మాట్లాడమని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని(Raghavendra rao) కోరిన వెంటనే ఆయన వేదిక మీదకి వచ్చి మాట్లాడతానని చెప్పారు. అప్పుడు రాఘవేంద్రరావు షూటింగ్ ఏ విధంగా జరుగుతుందో తొలిసారి చూసినప్పుడు ఎంత హేపీ ఫీల్‌ కలిగిందో నందిని రెడ్డి చెప్పడం ఆందరినీ ఆకర్షించింది.

అన్నీ మంచి శకునములే(Ani Manchi Shakunamule) సినిమా ప్రమోషన్‌ ఈవెంట్‌లో చిత్రదర్శకురాలు నందిని రెడ్డి(Nandhini reddy) మాట్లాడమని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని(Raghavendra rao) కోరిన వెంటనే ఆయన వేదిక మీదకి వచ్చి మాట్లాడతానని చెప్పారు. అప్పుడు రాఘవేంద్రరావు షూటింగ్ ఏ విధంగా జరుగుతుందో తొలిసారి చూసినప్పుడు ఎంత హేపీ ఫీల్‌ కలిగిందో నందిని రెడ్డి చెప్పడం ఆందరినీ ఆకర్షించింది. షూటింగ్‌ స్పాట్‌లో ఏ ఒక్కరూ స్ట్రెస్‌గానీ, ప్రెషర్‌గానీ, టెన్షన్‌గానీ ఏకోశాన లేకుండా అందరూ నవ్వుతూ ఎంతో రిలీఫ్‌గా కనిపించడం తనని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని నందిని గుర్తు చేసుకున్నారు. అంతకు ముందే మరో షూటింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ యూనిట్‌ మొత్తం ధుమదుమలాడుతూ, అరుచుకుంటూ కనిపించడం, ఇక్కడ రాఘవేంద్రరావు షూటింగ్‌లో అందరూ ఇలా చిద్విలాసంగా కనిపించినప్పుడు ఇంత వ్యత్యాసమా అని నివ్వెరపోవడమే తన వంతైందని ఆమె చెప్పారు.

దానికి స్పందిస్తూ, రాఘవేంద్రరావు వెంటనే తను కళ్ళద్దాలు పగలగొట్టడం ఎప్పుడూ చూడలేదా అని ప్రశ్నించారు. నందిని రెడ్డి కాస్తంతా మళ్ళీ విచిత్రమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. రాఘవేంద్రరావు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు, అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు, వర్క్ సరింగా ముందుకెళ్ళనప్పుడు ఎవరూ ఊహించని విధంగా కోపోద్రిక్తులు కావడం ఆయన సన్నిహితులకు మాత్రమే పరిచయమైన అనుభవం. అలా కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఆయన వెంటనే చేసే పని...ఎవరినీ తిట్టరు, కొట్టరు...తన కోపమంతా తన కళ్ళద్దాల మీదనే చూపిస్తారు. కోపం వచ్చినప్పుడు కళ్ళకున్న గ్లాసెస్‌ని తీసి నేలమీద వేసి కొట్టి, పగులగొట్టేస్తారు.

ఇది ఒకసారి కాదు. వందలసార్లు జరిగిఉంటుంది ఆయన కెరీర్‌లో.
ఆయన అలా అంటున్నప్పుడు, ఓ పాత్రికేయుడు ఎన్ని కళ్ళద్దాలు అలా పగలగొట్టి ఉంటారని రాఘవేంద్రరావుని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెప్పేలోగానే, ఆయనతో అధిక సంఖ్యంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పైన చిత్రాలు నిర్మించిన అశ్వనీదత్ అందుకున్నారు. వేటూరి సుందర రామ్మూర్తిగారి దగ్గర నుంచి సకాలంలో పాట రానప్పుడు ఓ పది పగిలిపోయి ఉంటాయి అని ఠక్కున సమాధానమిచ్చారు.

అలా వివిధ సందర్భాలలో ఆసహనం తారాస్థాయికి చేరినప్పుడు....పాపం ఆ కోపాన్ని ఎప్పుడూ కళ్ళద్దాలే భరించాయి. ఆయన కోపం నిర్మాతని ఎప్పుడూ నష్టపరచలేదు. నటీనటుల క్రేజ్‌ని ఎప్పుడూ తగ్గించలేదు. పైగా ఆయనతో చేసిన తర్వాత హైడిమాండ్‌లోకే వెళ్ళారు. ఆయన తీసిన అధికశాతం హిట్స్‌ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, నటీనటులు, సాంకేతికనిపుణలు బాగుపడినట్టే, ఆయన కోపం వల్ల కూడా బాగుపడినవాళ్ళు లేకపోలేదు. వాళ్ళే కళ్ళద్దాల కంపెనీవాళ్లు. “Written by Nagendra Kumar”

Updated On 9 May 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story