బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) కొడుకు ఆర్యన్‌ ఖాన్‌(aryan Khan) డేటింగ్‌లో ఉన్నాడట!

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) కొడుకు ఆర్యన్‌ ఖాన్‌(aryan Khan) డేటింగ్‌లో ఉన్నాడట! సోషల్‌మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. 26 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌ బ్రెజిల్‌కు(Brazil) చెందిన 34 ఏళ్ల నటి లారిస్సా బోనేసితో((Larissa Bonesi) డేటింగ్‌లో ఉన్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చెవులు కొరుక్కోవడానికి కారణం వీరిద్దరూ ముంబాయి వీధులలో రాత్రంతా లాంగ్‌ డ్రైవ్‌(Long drive) చేయడమే! అరంగేట్ర సినిమా కోసం తీరిక లేకుండా ఉన్న ఆర్యన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) అకౌంట్‌లో లారిస్సా ఫ్యామిలీని ఫాలో అవుతున్నాడని తెలిసింది. ఇటీవల లారిస్సా తల్లి బర్త్ డే సందర్భంగా విలువైన కానుకను కూడా ఆర్యన్‌ అందించాడట! తరచుగా వీరిద్దరు కలుసుకున్నట్టుగానే ఆదివారం రోజు కూడా కలిశారట! వీకెండ్ కావడంతో ముంబాయి నైట్‌ పార్టీకి లారిస్సా వెళ్లింది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో వ‌చ్చిన లారిస్సా బోనేసి పార్టీకి స్పెషల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఫోటోల కోసం ప్రయత్నించిన మీడియాను సున్నితంగా తిరస్కరించింది. లారిస్సా వెళ్లిన కాసేపటికి ఆర్యన్‌ కాన్‌, అతడి సోదరి సుహానా ఖాన్‌ ఈ పార్టీకి వచ్చారు. బ్లాక్ క‌ల‌ర్ టీష‌ర్ట్, బ్లూ క‌ల‌ర్‌ డెనిమ్ జాకెట్‌లో ఆర్య‌న్ ఖాన్‌ వచ్చాడు. ఇక సుహానా ఖానేమో హగ్గింగ్ డ్రెస్‌లో వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆర్యన్ ఖాన్, లారిస్సా బోనేసి ఒకే పార్టీలో ఉండ‌డంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నిర్ధారణ అవుతోంది. బ్రెజిల్‌కు చెందిన మాడ‌ల్, న‌టి లారిస్సా బోనేసి బాలీవుడ్ మూవీ గో గోవా గాన్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలుగులో కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో కలిసి తిక్కా అనే సినిమాలో న‌టించింది.

Eha Tv

Eha Tv

Next Story