వర్ధమాన కథానాయిక అరుంధతి నాయర్‌(Arundhathi nair) రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం తిరువనందపురంలోని ఆసుపత్రిలో ఐసీయూలో(ICU) చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తన సోదరుడుతో కలిసి స్కూటీలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ కారు అతి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని తిరువనంతపురం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అరుంధతి నాయర్‌ పరిస్థితి విషమంగా ఉంది.

వర్ధమాన కథానాయిక అరుంధతి నాయర్‌(Arundhathi nair) రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం తిరువనందపురంలోని ఆసుపత్రిలో ఐసీయూలో(ICU) చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తన సోదరుడుతో కలిసి స్కూటీలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ కారు అతి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని తిరువనంతపురం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అరుంధతి నాయర్‌ పరిస్థితి విషమంగా ఉంది. నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పింది. అరుంధతి ప్రస్తుతం వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నదని, ఆమె కుటుంబానికి ఆసుపత్రి ఖర్చులు భరించే స్థోమత లేదని తెలిపింది. తమ వంతుగా తాము సాయం చేశామని, అది సరిపోవడం లేదని, మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు దోహదపడుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో గోపిక అనిల్‌ తెలిపింది. అందులో బ్యాంకు వివరాలను కూడా ఇచ్చింది. 2014లో వచ్చిన పొంగి ఎలు మనోహర సినిమాతో అరుంధతి నాయర్‌ సినిమాల్లో అడుగుపెట్టింది. విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒట్టకోరు కాముకన్‌ సినిమాతో మలయాళంలో అడుగుపెట్టింది. పద్మిని, డోంట్‌ థింక్‌ అనే వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది. అరుంధతి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated On 18 March 2024 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story