ఈ చిత్రం మొదటి వారాంతంలో భారతదేశంలో 25 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లు

ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఆర్టికల్ 370 గత వారాంతంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం మొదటి వారాంతంలో భారతదేశంలో 25 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లు వసూలు చేసింది. దేశీయంగా ఈ చిత్రం అనూహ్యంగా మంచి వసూళ్లను సాధిస్తుండగా, ఈ చిత్రం ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్‌లో ఇబ్బందులను ఎదుర్కొంది. గల్ఫ్ దేశాల్లో ఆర్టికల్ 370ని నిషేధించారు. నిషేధానికి గల కారణాలను అధికారులు చెప్పలేదు.

ఇక హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' సినిమాను గల్ఫ్ దేశాల్లో నిషేధించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా బ్యాన్ ఎదుర్కొంటూ ఉండడం బాలీవుడ్ పరిశ్రమకు మరో ఎదురుదెబ్బ. ఈ సినిమాల్లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండడంతో నిషేధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గల్ఫ్ దేశం యొక్క సెన్సార్ చాలా కఠినంగా ఉంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న, పని చేస్తున్న చాలా దేశాల ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నందున ఏ మతాన్ని లేదా దేశాన్ని చెడుగా చిత్రీకరించే సినిమాలను అనుమతించరు. ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఆర్టికల్ 370లో యామీ గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్, వైభవ్ తత్వవాడి, స్కంద్ ఠాకూర్, అశ్విని కౌల్, కిరణ్‌కర్మార్కర్ నటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.

Updated On 27 Feb 2024 12:47 AM GMT
Yagnik

Yagnik

Next Story