Cheque Bounce Case On Ameesha Patel : పవన్ కళ్యాన్ హీరోయిన్ పై అరెస్ట్ వారెంట్, అమీషా పటేల్ పై చెక్ బౌన్స్ కేసు..
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్(Ameesha Patel)పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తనను మోసం చేసిందంటూ.. అజయ్ కుమార్(Ajay Kummar) అనే వ్యాక్తి అమీషాపై కోర్ట్ లో కేసు వేశాడు. ఇంతకీ ఏమయ్యిందంటే..?
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్(Ameesha Patel)పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తనను మోసం చేసిందంటూ.. అజయ్ కుమార్(Ajay Kummar) అనే వ్యాక్తి అమీషాపై కోర్ట్ లో కేసు వేశాడు. ఇంతకీ ఏమయ్యిందంటే..?
బాలీవుడ్ భామ.. టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ అమీషా పటేల్(Ameesha Patel). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బ్లాక్ బస్టర్ మూవీ బద్రి సినిమాతో తెలుగులో తిరుగులేని ఇమేజ్ సాధించిన ఈ నటి ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. అమిషా పటెల్ (Ameesha Patel)ను అంత త్వరగా మర్చిపోలేదు సౌత్ ఆడియన్స్. బుగ్గన సొట్టలతో.. చలాకీ నవ్వులతో కుర్రాళ్ల మనసులు దోచేసింది బ్యూటీ. బాలీవుడ్ భామ అయిన అమిషా బద్రి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత మహేష్ బాబు – నాని, ఎన్టీఆర్ – నరసింహుడు, బాలకృష్ణ – పరమవీరచక్ర సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో.. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈబ్యూటీపై కేసు నమోదు అయ్యింది. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. ఓ చెక్ బౌన్స్ కేసు విషయంలో అమీషాపై అరెస్ట్ వారెంట్ ఫైల్ అయ్యింది. రాంచీకి చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి సినిమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమిషాతో చేతులు కలిపాడు. దేశీ మ్యాజిక్ అనే సినిమాని రూపొందించడం కోసం అజయ్ కుమార్ నుంచి అమీషా 2.5 కోట్లు తీసుకుందట.. . ఒప్పందం ప్రకారమే 2013లో ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించింది అమిషా. కాని ఇప్పటి వరకూ సినిమా పూర్తి అవ్వలేదు.
ఏళ్ళు గడుస్తున్న సినిమా మాత్రం కంప్లీట్ చేయడం లేదు అమీషా,. దాంతో ఇది వర్కౌట్ అవ్వడంలేదు కనుక తన డబ్బుని తనకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా.. అజయ్ అమీషాను అడిగాడు. దాంతో ఆమె అజయ్ కు 2.5 కోట్ల చెక్ ఒకటి, 50 లక్షలకు మరో చెక్ ని ఇచ్చింది. అయితే ఆ చెక్ లు బౌన్స్ అవ్వడంతో అజయ్ సింగ్ కోర్ట్ ని ఆశ్రయించాడు. అమిషా పటెల్ మరియు ఆమె బిజినెస్ పార్ట్‌నర్ క్రునాల్ పై రాంచీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఇక కోర్టులో విచారణ జరగ్గా.. న్యాయస్తానం అమిషా పటెల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇక 420, 120 సెక్షన్ల కింద చీటింగ్ కేసుగా అమీషాను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేశరు. ఇప్పుడు మాత్రమే కాదు. గతంలో కూడా అమీషాపై ఇటువంటి కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి విషయాల్లో ఆమె కావాలనే ఇలా చేస్తుందంటూ... విమర్షలు వినిపిస్తున్నాయి.