యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా(Arjun Sarja) పెద్ద కూతురు, హీరోయిన్‌ ఐశ్వర్య(Aishwarya) వివాహం వైభవంగా జరిగింది. తమిళ నటుడు, దర్శకుడు తంబి రామయ్య(Thambi Ramaiah) కుమారుడు, యువ హీరో ఉమాపతిని(Umapathi) ఆమె పెళ్లి చేసుకుంది. జూన్‌ 10వ తేదీన చెన్నైలోని అంజనాసుత శ్రీయోగాంజనేయస్వామి ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్‌మెంట్‌ వేడుక గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది.

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా(Arjun Sarja) పెద్ద కూతురు, హీరోయిన్‌ ఐశ్వర్య(Aishwarya) వివాహం వైభవంగా జరిగింది. తమిళ నటుడు, దర్శకుడు తంబి రామయ్య(Thambi Ramaiah) కుమారుడు, యువ హీరో ఉమాపతిని(Umapathi) ఆమె పెళ్లి చేసుకుంది. జూన్‌ 10వ తేదీన చెన్నైలోని అంజనాసుత శ్రీయోగాంజనేయస్వామి ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్‌మెంట్‌ వేడుక గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై , జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10 న ఉదయం 9 to 10 గంటల మధ్యలో సినీ ప్రముఖుల సమక్షం లో వైభవంగా వివాహమహోతవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య సినిమాల్లో పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది. కూతురి కోసం అర్జున్‌ డైరెక్టర్‌గా మారి సినిమా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్‌ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు.

Updated On 11 Jun 2024 4:26 AM GMT
Ehatv

Ehatv

Next Story