✕
Shalini Pandey : గ్లామర్ డోస్ పెంచేసిన అర్జున్ రెడ్డి భామ.. ఫ్రీ అంటున్న నెటిజన్లు..
By EhatvPublished on 11 May 2023 1:01 AM GMT
షాలిని పాండే (Shalini Pandey).. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.

x
Shalini Pande
-
- షాలిని పాండే (Shalini Pandey).. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ భామ రణ్ వీర్ సింగ్ కు డెబ్యూటెంట్ గా జోడి కట్టింది. జయేష్ భాయ్ జోర్దార్ ( Jayeshbhai Jordaar) చిత్రంతో బాలీవుడ్‌లోనూ మంచి మార్కులు కొట్టేసింది ఈ ప్రితి.
-
- ఈ భామ తన చిన్న వయస్సులోనే కుటుంబానికి దూరమై ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇంజినీరింగ్ స్టూడెంట్ అయినప్పటికీ, ఆమె ఎప్పుడూ సినిమాలు, షోబిజ్ ప్రపంచం వైపు మొగ్గుచూపింది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి ( Arjun Reddy) సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది షాలిని.
-
- మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి తన తల్లి అంటే ఎంతో ఇష్టమట. వాళ్ల అమ్మే తనకు పెద్ద ఫ్యాన్ అట. తను ఎప్పుడూ తప్పు చేయదని మా అమ్మ నమ్మిందని ఓ ఇంటర్వూలో చెప్పింది ఈ భామ. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి తర్వాత షాలినికి పెద్దగా కలిసి రావడం లేదు. 2018లో మహానటి చిత్రంలో ఓ క్యారెక్టర్ చేసినప్పటికీ పెద్దగా ఆదరణ రాలేదు.
-
- ఎన్టీఆర్ కథానాయకుడు (N.T.R. Kathanayakudu), 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం వంటి సినిమాలు చేసినా ఈ భామకు సరైన బ్రేక్ రావడం లేదు. ఇవే కాకుండా హిందీ, తమిళం సినిమాలు చేస్తున్నా ఈ అమ్మడుకి సరైన హిట్ పడటం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు సిద్ధమయ్యింది. మొన్నామధ్య బ్లాక్ కలర్ డ్రెస్సులో అందాలు ఆరబోసినా కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదో ఏమోగాని ఇప్పుడు ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ.
-
- తాజాగా ఈ అమ్మడు లెగ్ నెట్ వేసుకుని.. బ్లెజర్ వేసుకుని తన సన్నటి తొడలు చూపిస్తూ అందాల ట్రీట్ ఇచ్చింది షాలిని షాండే. ఈ ఫొటోషూట్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. ఫ్రీ అనే క్యాప్షన్‌తో అప్లోడ్ చేసిన ఈ హాట్ ఫొటోలు ఇన్‌స్టా గ్రామ్‌లో వేడి పెంచేస్తున్నాయి.
-
- షాలిని త్వరలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan)తో ‘మహారాజా’ అనే చిత్రంలో నటించనుంది. ఇది ఆమె తొలి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుంది. సిద్దార్ధ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1862 నాటి మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా సినిమా రాబోతుంది. ఇక షాలినికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగే ఉంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీకి 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story