ఇటీవల విమానంలో ప్రయాణించిన తెలుగు నటి శ్రీసుధ(Srisudha) ఓ ఆకతాయి వికృత చేష్టలతో ఇబ్బందిపడింది. ఆ వెకిలి చేష్టలను భరించలేకపోయింది.. లాగి ఒక్కటిచ్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకుంది. వెనుక సీట్లో కూర్చున్న ఒకడు అదే పనిగా కాళ్లను ముందుకు చాచుతూ ఆమెను తాకే ప్రయత్నం చేశాడు. అప్పటికీ శ్రీసుధ పలు మార్లు హెచ్చరించింది. అయినా అతడు తన తీరు మార్చుకోలేదు.

ఇటీవల విమానంలో ప్రయాణించిన తెలుగు నటి శ్రీసుధ(Srisudha) ఓ ఆకతాయి వికృత చేష్టలతో ఇబ్బందిపడింది. ఆ వెకిలి చేష్టలను భరించలేకపోయింది.. లాగి ఒక్కటిచ్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకుంది. వెనుక సీట్లో కూర్చున్న ఒకడు అదే పనిగా కాళ్లను ముందుకు చాచుతూ ఆమెను తాకే ప్రయత్నం చేశాడు. అప్పటికీ శ్రీసుధ పలు మార్లు హెచ్చరించింది. అయినా అతడు తన తీరు మార్చుకోలేదు. విమాన సిబ్బందికి అతడి వెకిలి చేష్టల గురించి చెప్పింది. వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అతడికి మాటలతో చెబితే లాభం లేదనుకున్న శ్రీసుధ శక్తినంతా కూడదీసుకుని లాగి ఒక్కటిచ్చింది. అంతే ఆ దెబ్బకు అతడు సెట్‌రైట్‌ అయ్యాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది శ్రీసుధ.

అతడు తనను ఏరకంగా ఇబ్బంది పెట్టాడో చెప్పడానికి ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది. ఈ ఫోటోలో అతడు తన రెండు కాళ్లను శ్రీసుధ సీటు కింద పెట్టడం చూడొచ్చు. శ్రీసుధ అతడిని కొట్టడాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మాత్రం అలా కొట్టడం సరికాదని అంటున్నారు. ఇంత చిన్నదానికి అంత రాద్ధాంతం చేయాలా? అధికారులకు కంప్లయింట్‌ చేస్తే అయిపోయేది కదా! అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి శ్రీసుధ కౌంటర్‌ ఇచ్చింది. 'నాకు ఆ మాత్రం తెలియదా? రెండుసార్లు చెప్పి చూశాను. కానీ పట్టించుకోలేదు' అని గట్టిగానే రిప్లై ఇచ్చింది. అర్జున్‌రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, రూలర్‌, వలయం, వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి వంటి చిత్రాలలో నటించిన శ్రీసుధ ఫిజియోథెరపిస్ట్‌ కూడా! రెండేళ్ల కిందట శ్రీసుధ న్యూస్‌లో నిలిచింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్‌ కే.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది. పోలీసులకు కంప్లయింట్‌ కూడా ఇచ్చింది. అయితే ఈ కేసులో తాను రాజీకి వచ్చానంటూ తప్పుడు డ్యాకుమెంట్లు పుట్టించి ఓ పోలీసాఫీసర్‌పైనా ఫిర్యాదు చేసి వార్తలలో నిలిచింది. సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ సాయిరాం మాగంటి.. శ్యామ్‌ కె.నాయుడిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారంటూ ఆరోపణలు కూడా చేసింది.

Updated On 26 July 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story