బాలయ్య బాబు (Balayya Babu)హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK108.ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా కాస్టింగ్‌లో ప్లస్ అయ్యేలా బాలీవుడ్ నుంచి ఓ స్టార్‌ను తీసుకోబోతున్నారు.

Arjun Rampal to play villain role in Anil Ravipudi balakrishna movie
బాలయ్య బాబు (Balayya Babu)హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK108.ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా కాస్టింగ్‌లో ప్లస్ అయ్యేలా బాలీవుడ్ నుంచి ఓ స్టార్‌ను తీసుకోబోతున్నారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నారు. దీంతో ఆయన టాలీవుడ్లోకి అఫిషియల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ సీక్వెన్స్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారని సమాచారం. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ చాలా బాగా వచ్చినట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంత బాగా రావడంతో చిత్ర టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉందట.
షైన్ స్క్రీన్ (Shine Screens) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్గా నటిస్తోంది. బ్యూటీ ఫుల్ శ్రీలీల (Sree Leela) ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. మంచి అంచనాలతో ఈ సినిమాకు దసరా కానుకగా విడుదలకు సిద్దమవుతోంది.
