మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ విడిపోయారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకున్నారు.

మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ విడిపోయారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకున్నారు. చాన్నాళ్లపాటు ఒకే ఫ్లాట్ లో సహజీవనం చేసిన వీరిద్దరు కొన్ని నెలల కిందట వేరువేరు ఫ్లాట్స్ కు మారారు. అయితే అటు మలైకా( Malaika Arora) కానీ, ఇటు అర్జున్‌ (Arjun Kapoor)కానీ తామిద్దరం విడిపోయామని ఎప్పుడూ చెప్పలేదు. రీసెంట్‌గా మలైకా అరోరా తండ్రి చనిపోయారు. అప్పుడు అర్జున్‌ కపూర్‌ ఆమెకు అండగా నిలిచారు. అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు. దాంతో వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారని అంతా భావించారు. కానీ మళ్లీ కలవలేదట! వేరువేరుగా ఉంటున్నారట! ఈ విషయాన్ని అర్జున్‌ కపూరే స్వయంగా చెప్పుకొచ్చాడు. ముంబాయి(Mumbai)లో రాజ్‌ థాక్రే (Raj Thackeray)ఇచ్చిన దీపావళి పార్టీకి అర్జున్‌ కపూర్‌ హాజరయ్యాడు. గెస్ట్‌లను ఉద్దేశించి మాట్లాడేందుకు మైక్‌ అందుకోగానే అందరూ మలైకా.. మలైకా అని అరిచారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని, ఈ మాట విన్నాక ఇక అందరూ రిలాక్స్‌ అవ్వొచ్చని అర్జున్‌ కపూర్‌ అన్నారు. సో, వారిద్దరూ విడిపోయారన్నది కన్ఫామ్‌ అన్నమాట! 2018 నుంచి మలైకా, అర్జున్‌ కలిసే ఉంటున్నారు. కలిసి ఫారిన్‌ ట్రిప్పులకు వెళ్లారు.

ehatv

ehatv

Next Story