సినీ పరిశ్రమలో కొనసాగాలంటే గ్లామర్ అవసరమే కానీ, అదొక్కటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. యాక్టింగ్ రాకపోయినా అందంతో నెట్టుకురావచ్చనుకుంటారు చాలా మంది. అలాంటి భావనతో అందానికి మెరుగులద్దాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ప్రాణాలనే పోగొట్టుకుంటారు. ఇప్పటికే చాలా మంది అందాలభామలు కన్నుమూశారు.

Jacqueline Carrieri
సినీ పరిశ్రమలో కొనసాగాలంటే గ్లామర్ అవసరమే కానీ, అదొక్కటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. యాక్టింగ్ రాకపోయినా అందంతో నెట్టుకురావచ్చనుకుంటారు చాలా మంది. అలాంటి భావనతో అందానికి మెరుగులద్దాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ప్రాణాలనే పోగొట్టుకుంటారు. ఇప్పటికే చాలా మంది అందాలభామలు కన్నుమూశారు. ఆర్తి అగర్వాల్(Aarthi Agarwal) ఇలాగే కదా చనిపోయారు. కన్నట నటి చేతన రాజ్(Chetan Raj) కూడా కాస్మోటిక్ సర్జరీ(Cosmetic surgery) వికటించే చనిపోయారు. ఇప్పుడు మరో ప్రముఖ నటి ఇలాగే కన్నుమూసింది. అర్జెంటీనా(Argentina)కు చెందిన మాజీ అందాల సుందరి, నటి జాక్వెలిన్ కరీరీ(Jacqueline Carrieri) అర్థాంతరంగా చనిపోయారు. ఆమె అందానికి వంకపెట్టడానికి ఏమీ లేదు. కానీ ఆమె మాత్రం మరింత అందంగా తయారవ్వాలనుకున్నారు. కాస్మోటిక్ సర్జరీ చేసుకున్నారు. సర్జరీ జరుగుతున్న సమయంలో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయారు. అనేక ఇంగ్లీషు సినిమాలలో నటించిన జాక్వెలిన్ కరీరీకి హాలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అక్టోబర్ 1వ తేదీన ఆమె కన్నుమూశారు. లేటెస్ట్‌గా ఆ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
