కొన్ని కాంబినేషన్లు అమితాసక్తినిక కలిగిస్తాయి. ఇండియన్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy)-ఎన్టీఆర్‌(NTR) కాంబో కూడా అలాంటిదే.

కొన్ని కాంబినేషన్లు అమితాసక్తినిక కలిగిస్తాయి. ఇండియన్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy)-ఎన్టీఆర్‌(NTR) కాంబో కూడా అలాంటిదే. వీరిద్దరి కలియకలో ఓ సినిమా వస్తే బాగుండనేది అభిమానుల కోరిక. దేవర(Devara) సినిమా ట్రైలర్‌ రేపు, అంటే మంగళవారం రిలీజ్‌ కాబోతున్నది. ట్రైలర్‌ లాంచ్‌కు ముందు ఎన్టీఆర్‌, సందీప్‌రెడ్డి వంగా ముంబాయిలో కలుసుకున్నారు. వీరిద్దరి కలయిక ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. యానిమల్ లాంటి బాలీవుడ్‌ హిట్ తో ఇండస్ట్రీ సెన్సేషన్ డైరెక్టర్‌గా మారిపోయిన సందీప్‌రెడ్డి ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా తీస్తున్నాడా? అనే చర్చ మొదలయ్యింది.

అయితే ఎన్టీఆర్‌, సందప్‌ వంగ కలయికలో పెద్ద విశేషమేమీ లేదని, సాధారణ సమావేశమేనని అంటున్నారు. వీరిద్దరూ తమ నుంచి రాబోయే సినిమా విశేషాలు పంచుకున్నట్లు సమాచారం. దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల అవుతుండటంతో చూడటానికి ఎదురుచూస్తున్నట్లు సందీప్‌రెడ్డి వంగా చెప్పారట! వీరిద్దరికి ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులోనైనా ఓ ప్రత్యేకమైన కథతో సినిమా చేసే అవకాశం ఉంది. ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు సందీప్‌రెడ్డి. దాంతో పాటు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్‌ను రూపొందించే పనిలో ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story