మ్యూజిక్‌, ట్రైలర్‌ లాంఛింగ్‌కు రెడీ అయిన పొన్నియన్‌ సెల్వన్‌-2, మెస్మరైజ్ చేయబోతున్న రెహ్మాన్(A. R. Rahman ). భారీ బడ్జెట్ తో రూపొందుతునన పొన్నియన్ సెల్వన్ 2(Ponniyin Selvan2) కోసం తమిళ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పొన్నియ‌న్ సెల్వన్‌-1 ను మరిపించేలా.. సీక్వెల్‌ ని అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం, బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మ్యూజిక్‌, ట్రైలర్‌ లాంఛింగ్‌కు రెడీ అయిన పొన్నియన్‌ సెల్వన్‌-2, మెస్మరైజ్ చేయబోతున్న రెహ్మాన్(A. R. Rahman ). భారీ బడ్జెట్ తో రూపొందుతునన పొన్నియన్ సెల్వన్ 2(Ponniyin Selvan2) కోసం తమిళ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పొన్నియ‌న్ సెల్వన్‌-1 ను మరిపించేలా.. సీక్వెల్‌ ని అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం, బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

పొన్నియన్‌ సెల్వన్‌ ఫస్ట్ పార్ట్ సక్సెస్ తో.. పార్ట్ 2ను పరుగులు పెట్టిస్తున్నాడు దర్శకుడు మ‌ణిర‌త్నం (Mani Ratnam). ఆయన కాంపౌండ్‌ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి పొన్నియ‌న్ సెల్వన్‌-1కు మించి.. సీక్వెల్‌ ని అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పొన్నియన్‌ సెల్వన్‌-2 (Ponniyin Selvan-2) షూటింగ్ పరుగులు పెడుతోంది.. ఈసినిమాను ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీమ్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ నుంచి వరుసగా అప్ డేట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా మ్యూజిక్ కు సబంధించి ఓ అప్ డేట్ ను ఆడియన్స్ కోసం వదిలారు.

ఈసినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది రెహమాన్ మ్యూజిక్. పొన్నియన్‌ సెల్వన్ 2 మ్యూజిక్‌, ట్రైలర్‌ లాంఛింగ్‌కు మణిరత్నం ముహూర్తం పెట్టేశారు. మ్యూజిక్‌, ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను మార్చి 29న చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. రెహమాన్(AR Rahman)ట్వీట్ చేశారు. అంతే కాదు ఈ సినిమా కోసం ఎలాంటి బీజీఎం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, చేస్తున్నది ఓ వీడియో రూపలో తెలియజేశారు రెహమాన్. ట్విట్టర్ లో ఓ వీడియోను ఏఆర్‌ రెహమాన్‌ షేర్ చేశాడు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విధంగా #CholasAreBack హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పొన్నియన్‌ సెల్వన్ -2లో 7 పాటలుండబోతున్నట్టు వీడియా ద్వారా ఏఆర్‌ రెహమాన్‌ క్లారిటీ ఇచ్చాడు. పొన్నియన్‌ సెల్వన్ -2లో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్‌, త్రిషతోపాటు పలువురు నటీనటులు కీ రోల్స్ లో నటిస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ, కన్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ కాబోతోంది మూవీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి త్రిష, కార్తీ కాంబినేషన్‌లో ఆగనందే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేయగా.. ఆ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Updated On 27 March 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story