చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేయబోతున్నాడు సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్(AR Rahman). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) సినిమాకు స్వరాలు సమకూర్చడానికి ఆయన గ్రీసిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేయబోతున్నాడు సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్(AR Rahman). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) సినిమాకు స్వరాలు సమకూర్చడానికి ఆయన గ్రీసిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ స్టార్ న రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్(shankar) కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. త్వరలో మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టబోతున్నాు. ఇక ఈమూవీ తరువాత సినిమాలుకూడా రామ్ చరణ్ సెట్ చేసుకుని పెట్టుకున్నాుు.

ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు(Buchchi sana) దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు రామ్ చరణ్. భారీ వ్యయంతో పాన్ ఇండియా సినిమా రూపొందబోతున్న ఈసినిమా కు మ్యజిక్ డైరెక్టర్ గా మొదటి నుంచి ఏఆర్ రెహమాన్ అని అంటున్నారు. తాజాగా ఈ విషయాన్ని కన్ ఫార్మ్ కూడా చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడానికి ఏఆర్ రహమాన్ అంగీకరించారని వార్తలు వచ్చాయి.

చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు చిత్రసీమలో ఓ చిత్రానికి సంగీతం అందించడం గమనార్హం. ఈ సందర్భంలో, అతిపెద్ద పాన్-ఇండియా చిత్రంగా ఉండబోతున్న ఈ చిత్రంలో ఒక సూపర్ స్టార్ చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా సాయి పల్లవి, కియారా అద్వాని నటిస్తారని టాక్. అంతే కాదు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా సినిమాలో నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా సెట్ అవుతుందని సమాచారం.

Updated On 8 Jan 2024 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story