తమిళ నాట ప్రముఖులైనా... సామాన్యులైనా తమిళంలో మాట్లాడాలి.. తమిళం రాదు అంటే మాత్రం వారిపై ట్రోల్స్ తప్పవు. ఇక ఈమధ్య ఈ ఇబ్బంది ఫేస్ చేశారు... ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ భార్య సైరా భాను తమిళంలో సరిగా మాట్లాడలేకపోవటంపై సోషల్‌ మీడియా లో భారీగా ట్రోలింగ్స్‌కు గురవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ నెటిజన్లు ఆమెపై ఓ స్థాయిలో ఫైర్‌ అవుతున్నారు. ఆమెతో పాటు ఏఆర్‌ రెహ్మాన్‌పై కూడా ట్రోలింగ్స్‌ చేస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ భార్య కు తమిళం రాదా అంటూ.. తమిళ నటి కస్తూరి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అదరిపోయే జవాబిచ్చాడు రెహమాన్. అసలు విషయం ఏంటీ అటే..?

తమిళ నాట ప్రముఖులైనా... సామాన్యులైనా తమిళంలో మాట్లాడాలి.. తమిళం రాదు అంటే మాత్రం వారిపై ట్రోల్స్ తప్పవు. ఇక ఈమధ్య ఈ ఇబ్బంది ఫేస్ చేశారు... ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ భార్య సైరా భాను తమిళంలో సరిగా మాట్లాడలేకపోవటంపై సోషల్‌ మీడియా లో భారీగా ట్రోలింగ్స్‌కు గురవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ నెటిజన్లు ఆమెపై ఓ స్థాయిలో ఫైర్‌ అవుతున్నారు. ఆమెతో పాటు ఏఆర్‌ రెహ్మాన్‌పై కూడా ట్రోలింగ్స్‌ చేస్తున్నారు.

ఇక ఇది ఇలా నడుస్తున్న క్రమంలోనే రెహమాన్ భార్యను సోషల్ మీడియా వేదికగా.. ప్రముఖ తమిళ, తెలుగు నటి కస్తూరి శంకర్‌ ప్రశ్నించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ భార్యపై కామెంట్లు చేశారు. ట్విట్టర్ లో ఆమె స్పందిస్తూ.. ఏమిటి ? ఏఆర్‌ రెహ్మాన్‌ భార్యకు తమిళం తెలీదా? ఆమె మాతృ భాష ఏది? వాళ్లు తమ ఇళ్లలో ఏ భాష మాట్లాడుకుంటారు? అని ప్రశ్నించింది. ఇక కస్తూరి శంకర్‌ ట్విట్టర్ కామెంట్లకు రెహమాన్ కూడా స్పందించారు. డిఫరెంట్ గా కామెంట్ చేసి.. కస్తూరికి కౌంటర్ ఇచ్చాడు.

రెహమాన్ దంపతులు రీసెంట్ గా చెన్నైలో వికటన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహమాన్ హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని తన భార్యను కోరాడు. అయితే తనకు తమిళం సరిగ్గా రాదని, స్పీడ్ గా మాట్లాడలేనని సైరా బాను చెప్పింది. తాను ఏఆర్‌ రెహమాన్‌ గొంతు విని ప్రేమలో పడిపోయానని అన్నారు. సైరా భాను తమిళంలో మాట్లాడలేకపోవటంతోటే రచ్చ మైదలైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో కస్తూరి శంకర్ ఈ విధంగా ప్రశ్నించింది.

దాంతో రెహమాన్ రిప్లై ఇస్తూ.. ప్రేమకు భాష లేదు అన్నారు. నా ప్రేమను నేను గౌరవిస్తానని తన భార్యకు మద్దతుగా సమాధానం ఇచ్చాడు. అంతే కాదు ఈ రిప్లై కూడా తమిళంలో ఇచ్చాడు. అయితే, రెహ్మాన్‌ ఇచ్చిన రిప్లైతో వివాదానికి తెరపడినట్లు అయింది. మరి, సైరా భాను తమిళంలో మాట్లాడలేకపోవటం కారణంగా ఆమెపై ఆయన ఇచ్చిన ఈ రిప్లై తాలూకా పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated On 29 April 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story