సమ్మర్ లో మంచి సినిమాలు లేక మూవీ లవర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు

సమ్మర్ లో మంచి సినిమాలు లేక మూవీ లవర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతే ఎక్కువగా థియేటర్ యజమానులు కూడా పడుతున్నారు. సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో థియేటర్లకు కనీసం మెయిన్టెనెన్స్ డబ్బులు కూడా వస్తాయో రావో అని థియేటర్ యాజమానులు భయపడుతూ ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల కారణంగా సమ్మర్ సీజన్ లో తెలుగు సినిమాలను పెద్దగా విడుదల చేయలేదు. చాలా వరకూ వాయిదా పడిపోయాయి. ఇప్పుడు ఓ రీరిలీజ్ సినిమా కనీసం కొన్ని ప్రాంతాల్లో అయినా సందడి చేస్తుందో లేదో చూడాలి. ఆ సినిమా మరేదో కాదు శంకర్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా అపరిచితుడు.

శంకర్ అన్నియన్ (2005) తెలుగులో అపరిచితుడు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో విక్రమ్, సదా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్‌కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టింది. టెలివిజన్‌లో కూడా అపరిచితుడు అప్పటి నుండి అద్భుతమైన రేటింగ్‌లను సాధించింది. ఈ యాక్షన్ డ్రామా మే 17, 2024 (శుక్రవారం)న తెలుగులో గ్రాండ్ రీ-రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా విడుదలలు లేవు. IPL, ఎన్నికల ఫీవర్ కారణంగా ప్రేక్షకులు నెలల తరబడి థియేటర్లకు రాకపోవడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అనుకున్నట్లుగా జరిగితే నిజంగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు జాక్‌పాట్. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ మరింత ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ తెలుగులో చూడాలి.

Updated On 16 May 2024 12:18 AM GMT
Yagnik

Yagnik

Next Story