AP Politics Created Heat Between Manchu brothers : మంచు బ్రదర్స్ మధ్య వేడి పుట్టించిన ఏపీ రాజకీయాలు
మోహన్‌బాబు(Mohan Babu) కుమారులు మంచు విష్ణు(Manch Vishnu), మంచు మనోజ్(Manchu Manoj)లిద్దరూ ఒకప్పుడు రామలక్ష్మణుల్లా అన్యోన్యంగా ఉండేవారు. ఒక్క తల్లి పిల్లలు కాకపోయినా ఎంతో సఖ్యంగా ఉండేవారు. ఎవరి కన్ను కుట్టిందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. గొడవల వరకు వెళ్లింది. అసలు మంచు బ్రదర్స్ మధ్య విభేదాలకు కారణాలేమిటన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
మోహన్‌బాబు(Mohan Babu) కుమారులు మంచు విష్ణు(Manch Vishnu), మంచు మనోజ్(Manchu Manoj)లిద్దరూ ఒకప్పుడు రామలక్ష్మణుల్లా అన్యోన్యంగా ఉండేవారు. ఒక్క తల్లి పిల్లలు కాకపోయినా ఎంతో సఖ్యంగా ఉండేవారు. ఎవరి కన్ను కుట్టిందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. గొడవల వరకు వెళ్లింది. అసలు మంచు బ్రదర్స్ మధ్య విభేదాలకు కారణాలేమిటన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయపరమైన విభేదాలు కూడా గొడవలకు కారణమై ఉండవచ్చని కొందరు అంటున్నారు.
మంచు విష్ణు భార్య వెరోనికా(Viranica) స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) బాబాయ్ కూతురు. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక(Bhuma Mounika) భూమా నాగిరెడ్డి-శోభ దంపతుల రెండో కూతురు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. ఆళ్లగడ్డలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. మౌనిక అక్క అఖిలప్రియ ఒకప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) టికెట్ మీదనే అళ్లగడ్డ ఎమ్మెల్యే అయ్యారు. కొన్నాళ్ల తర్వాత తండ్రి నాగిరెడ్డితో కలిసి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. నాగిరెడ్డి మరణానంతరం ఆమెకు మంత్రి పదవి దక్కింది. చంద్రబాబు మంత్రివర్గంలో ఆమె మంత్రిగా పని చేశారు. అంటే భూమా కుటుంబం అంతా తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులేనన్నమాట! అఖిల ప్రియ కొన్ని వివాదాల కారణంగా రాజకీయాలకు కాసింత దూరంగా ఉన్నారు. ఆ స్థానాన్ని భర్తి చేయాలన్నది మౌనిక ఆలోచన. ఇక మంచు విష్ణు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు సన్నిహితులు. జగన్‌తో సాన్నిహిత్యం ఉంది. మా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు జగన్‌ను కలిసి వచ్చారు కూడా! మా ఎన్నికల్లో జగన్ సహాయ సహకారాలు లభించాయి. ఆ లెక్కన మంచు విష్ణు వైసీపీ అయితే, మంచు మనోజ్ తెలుగుదేశంపార్టీ అనుకోవాలి. తాజా రాజకీయ పరిణామాలు మంచు బ్రదర్స్ మధ్య దూరం పెంచాయి. లేటెస్ట్‌గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మూడు పట్టభద్రుల నియోజకవర్గాలలో గెలిచింది. ఎమ్మెల్యే కోటాలో కూడా చాలినంత బలం లేకపోయినా టీడీపీ ఒక స్థానాన్ని గెల్చుకుంది. ఫలితాలు వచ్చిన తర్వాత మంచు బ్రదర్స్ మధ్య చిన్నపాటి చర్చ జరిగిందట! మాటా మాటా పెరిగిందట! అదే గొడవకు కారణమయ్యిందట! మొత్తం మీద ఏపీలో ఉన్న రెండు బలమైన పార్టీలు రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాయన్నమాట!