సంచ‌ల‌నాల ద‌ర్శకుడు ఆర్జీవీ(RGV) తాజా చిత్రం ‘వ్యూహం’ టీజర్(Vyuham Teaser) తో మరో సంచలనం సృష్టించారు. శ‌నివారం విడుద‌లైన చిత్ర టీజ‌ర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) కలకలం రేపుతోంది. వ్యూహం టీజర్ విడుదల తర్వాత ఆర్జీవీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆర్జీవీపై ఏపీ పీసీసీ(APPCC) అధ్యక్షుడు చీఫ్ గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraja) మండిపడ్డారు.

సంచ‌ల‌నాల ద‌ర్శకుడు ఆర్జీవీ(RGV) తాజా చిత్రం ‘వ్యూహం’ టీజర్(Vyuham Teaser) తో మరో సంచలనం సృష్టించారు. శ‌నివారం విడుద‌లైన చిత్ర టీజ‌ర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) కలకలం రేపుతోంది. వ్యూహం టీజర్ విడుదల తర్వాత ఆర్జీవీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆర్జీవీపై ఏపీ పీసీసీ(APPCC) అధ్యక్షుడు చీఫ్ గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraja) మండిపడ్డారు. ఉన్నవి లేనట్లుగా.. లేనివి ఉన్నట్లుగా చూపిస్తాడంటూ ఆర్జీవీపై ఫైర్ అయ్యారు. సంచలనాల కోసం సినిమాలో సోనియా గాంధీని(sonia Gandhi) కించపరిచేలా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ(gandhi), నెహ్రూల(Nehru) కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి(Rajashekar Reddy) మ‌ర‌ణం త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో అప్పటి కాంగ్రెస్‌ అధిష్ఠానం.. జగన్‌ను బెదిరించినట్లు ఈ టీజర్‌లో చూపించారు. జగన్ అధిష్టానం విన‌క‌పోవ‌డంతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు టీజర్‌లో చూపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వ‌ర్మ‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

Updated On 25 Jun 2023 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story