AP Government Land To Sirivennela Family : సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి విశాఖపట్టణంలో స్థలం కేటాయించిన ఏపీ ప్రభుత్వం
కొన్ని వేల పాటలను రాశారు సీతారామశాస్త్రి(Sirivennela Sitaramasastri ). సిరివెన్నెల సినిమా(Sirivennela Movie)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఈసినిమాపేరునే తన ఇంటిపేరుగా.. మార్చుకున్నారు. అద్భుతమైన గీతాలను రచించి.. జాతీయ అవార్డులతోపాటు.. నంది పురస్కారాలను కూడా అందుకున్నారు సిరివెన్నెల.
కొన్ని వేల పాటలను రాశారు సీతారామశాస్త్రి(Sirivennela Sitaramasastri ). సిరివెన్నెల సినిమా(Sirivennela Movie)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఈసినిమాపేరునే తన ఇంటిపేరుగా.. మార్చుకున్నారు. అద్భుతమైన గీతాలను రచించి.. జాతీయ అవార్డులతోపాటు.. నంది పురస్కారాలను కూడా అందుకున్నారు సిరివెన్నెల. తెలుగు సాహిత్యాన్ని ఒంటరి చేసి.. తిరిగిరాని లోకాలకువెళ్లిపోయిన మహాకవి జ్ఞాపకార్ధం.. ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులను సత్కరించింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుుగ సినిమా పరిశ్రము చేసిన సేవ ప్రతీ ఒక్కిరికి తెలుసు. తెలుగు పాటను.. తెలుగు మాటను ప్రపంచ వ్యాప్తం చేయడంతో.. పదాల అల్లికతో..మనసుకు హత్తుకునే పాటలను రాయడంతో ఆయనకు ఆయనే సాటి. అనారోగ్యంతో తెలుగు సినిమా సాహిత్యాన్ని ఒంటరి చేసి వెళ్లిపోయిన సీతారాముడు.. తెలుగు పాట ఉన్నంత వరకూ బ్రతికే ఉంటారు. ఇక ఆయన సేవను గుర్తిస్తూ.. ఏపీ ప్రభుతవం వారి కుటుంబానికి ఇంటి స్థలాన్నికేటాయించింది. ఆయన మరణించిన సమయంలో ప్రకటించిన విధంగా సిరివెన్నెల కుటంబానికి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.
దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. విశాఖపట్టణంలోని బీచ్ కు ఆనుకుని ఉన్నవుడా లే అవుట్ లో ఈ స్థలాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత అధికారుల కోసం ప్రత్యేకంగా ఈ లే అవుట్ ఏర్పాటు చేశారు. నిజానికి సిరివెన్నెల పుట్టి పెరిగింది విశాఖపట్టణం, అనకాపల్లి ప్రాంతాల్లోనే. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. సీతారామ శాస్త్రి సోదరులు ఇప్పటికే అక్కడే సెటిల్ అయ్యి ఉన్నారు. ఇండస్ట్రీలో రాణించడంతో సిరివెన్నెల తన కుటుంబంతో హైదరాబద్ లో ఉంటున్నారు.
ఇక చాలా కాలం అనారోగ్యంతో బాధపడిన సిరివెన్నెల సీతారామశాస్త్రీ..కొన్నాళ్లు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. . 30 నవంబర్ 2021 న కన్నుమూశారు. . అయితే అప్పుడు ఆయన వైద్యానికి అయిన ఖర్చులను ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ఇక అప్పుడే సీతారామశాస్త్రి కుటుంబానికి స్థలం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా విశాఖపట్టణంలోని వుడా లే అవుట్ లో సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.
ప్రభుత్వం విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని చూస్తోంది. ఇప్పటికే సినిమా పెద్దలతో కూడా చర్చలు జరిపింది. అంతే కాదు విశాఖను రాజధానిగా చేయాలి అని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. అక్కడ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కు రాయితీలు, ప్రత్యేక నిథులు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈక్రమంలో సిరివెన్నెల లాంటి ప్రముఖులకు గుర్తుగా ఇక్కడే స్థలం కేటాయించడం చర్చనీయాంశం అయ్యింది. సినిమా ఇండస్ట్రీకి సబంధించి మరిన్ని డెవలప్ మెంట్స్ ను చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.