Guntur Karam : మహేశ్‌బాబుపై అంత ప్రేమ ఎందుకు?
మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) రూపొందించిన గుంటూరుకారం(Guntur Karam) సినిమా 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా టికెట్ల ధరను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కూడా అనుమతినిచ్చింది. అన్ని థియేటర్లలో 50 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ సర్కార్ ఇది వరకే టికెట్ల రేట్ల పెంపుకు అనుమతినిచ్చింది.
మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) రూపొందించిన గుంటూరుకారం(Guntur Karam) సినిమా 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా టికెట్ల ధరను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కూడా అనుమతినిచ్చింది. అన్ని థియేటర్లలో 50 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ సర్కార్ ఇది వరకే టికెట్ల రేట్ల పెంపుకు అనుమతినిచ్చింది. ఏపీలో పది రోజుల పాటు అన్ని థియేటర్లలో టికెట్‌కు 50 రూపాయలచొప్పున పెంచుకోవచ్చు.
సాధారణంగా పెద్ద సినిమాలకు, అగ్రహీరోలు నటించిన సినిమాలకు టికెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇస్తుంటాయి. ఇదేం కొత్త విషలయం కాదు, పెద్ద విషయం కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఇది కీలకమైనదే! గతంలో కొంత మంది హీరోలకు సంబంధించి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సర్కార్ అనుమతించలేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పవన్ కల్యాణ్(Pawan kalyan) సినిమాలకు సంబంధించి ధరల పెంపు అంశంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ధరల పెంపునకు నిరాకరించింది. బాలకృష్ణ(Balakrishna) సినిమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తొలుత ఇలాగే వ్యవహరించింది. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ధరలు పెంచి సామాన్యుడు సినిమా చూసే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
అగ్రహీరోలు రెమ్యునిరేషన్లను తగ్గించుకుంటే టికెట్ల రేట్లు ఆటోమాటిక్‌గా తగ్గుతాయని పేర్కొంది. అప్పట్లో టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే ప్రభుత్వం పెద్ద స్పందించలేదు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోందంటూ సదరు హీరోల అభిమానులు విమర్శించారు. ప్రభుత్వం మాత్రం తాము పేదలవైపే ఉన్నామని కరాఖండిగా చెప్పింది. ఇప్పుడు గుంటూరుకారం సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపుపై చిత్రయూనిట్ పెద్దగా స్పందించలేదు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పింది. మహేశ్‌బాబుపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.