జబర్దస్త్స్టేజ్ పై తనదైన పంచ్ లు విసురుతూ.. ఆడిమనస్ ను కడుపుబ్బా నవ్విస్తుండే వాడు పంచ్ ప్రసాద్. అటువంటిది ఆయన కిడ్నీ సమస్య వచ్చినప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కోంటూ.. ఉన్నాడు. ఈక్రమంలో చాలా కాలంగా డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు నిలపుకుంటూ వస్తున్నాడు. దాంతో అతను దాచుకున్న డబ్బులు అయిపోగా.. అనారోగ్యంతో కూడా జబర్థస్త్ లో పనిచేస్తూ.. వచ్చిన డబ్బులు తన ట్రీట్మెంట్ కే అవుతూ వచ్చాయి.

ఈమద్య చాలా సీరియస్ కండీషన్ లోకి వెళ్ళింది జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్(Jabardasth Punch Prasad) ఆరోగ్యం. కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న ఆయనకు అందగా ముందుకు వచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(AP Govt).

జబర్దస్త్స్టేజ్ పై తనదైన పంచ్ లు విసురుతూ.. ఆడిమనస్ ను కడుపుబ్బా నవ్విస్తుండే వాడు పంచ్ ప్రసాద్. అటువంటిది ఆయన కిడ్నీ సమస్య వచ్చినప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కోంటూ.. ఉన్నాడు. ఈక్రమంలో చాలా కాలంగా డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు నిలపుకుంటూ వస్తున్నాడు. దాంతో అతను దాచుకున్న డబ్బులు అయిపోగా.. అనారోగ్యంతో కూడా జబర్థస్త్ లో పనిచేస్తూ.. వచ్చిన డబ్బులు తన ట్రీట్మెంట్ కే అవుతూ వచ్చాయి.

అయితే తాజాగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు సర్జరీ చేయాల్సి రాగా.. తన భార్య కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. కాని వారిద్దరి చిన్నవయస్పే కావడంతో డోనర్ కోసం వెయిట్ చేయవచ్చు అంటూ డాక్టర్ సలహా ఇచ్చారు. ఇక రీసెంట్ గా ప్రసాద్ కు ఆరోయ్యం విషమించడంతో.. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దాంతో డబ్బు అవసరంతో తోటి కమెడియన్స్ వాళ్లు చేయాల్సిన సాయంచేశారు.. మిగతా అమౌంట్ కోసం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పంచ్ ప్రసాద్ కి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆయన్ని ఆర్థికంగా ఆదుకోవాలని బ్యాంకు, యూపీఐ డీటెయిల్స్ షేర్ చేశారు.

దీంతో ఈ విషయం పట్ల స్పందించిన ఓ నెటిజెన్.. ప్రసాద్ కు సబంధించిన డీటేయిల్స్ అన్నీ ఏపీ సీఎంఓ పరిధికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాలను పర్యవేక్షించే సీఎంఓ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ హరికృష్ణ ప్రసాద్ విషయంలో స్పందించారు. ఆల్రెడీ మా టీం పంచ్ ప్రసాద్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తరువాత.. అసలు విషయాన్ని బేరీజు వేసి.. అతనికి కావల్సిన ఆర్దిక సాయం చేస్తామంటూ.. హరికృష్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దాంతో ప్రసాద్ స్నేహితులైన జబరస్థస్త్ కమెడియన్స్ తో పాటు.. ప్రసాద్ కుటుంబం కూడా ఆనందంలో మునిగిపోయారు. అంతా ప్రసాద్ త్వరగా కోలుకోవాలి అని కోరకుంటున్నారు.

Updated On 9 Jun 2023 11:50 PM GMT
Ehatv

Ehatv

Next Story