కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క శెట్టి. స్టార్ హీరోలను మించిన స్టార్ డమ్ తో.. వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈబూటీ.. ఆతరువాత సోలో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించింది.

అనుష్క(Anushka Shetty) సినిమాల నుంచి నిష్క్రమించనుందా..? ప్రస్తుతం చేస్తున్న సినిమానే ఆమెకు చివరి సినిమానా..? అనుష్క నిజంగా సినిమాలకు వీడ్కోలు పలికితే.. వెంటనే పెళ్ళి చేసుకుంటుందా..? అసలు నిజం ఏంటీ..?

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క శెట్టి. స్టార్ హీరోలను మించిన స్టార్ డమ్ తో.. వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈబూటీ.. ఆతరువాత సోలో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించింది. కన్నడ తో పాటు హిందీ సినిమాలు అటు సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటించి స్టార్ హీరోయిన్‌గా.. మారింది అనుష్క. హీరోలు లేకపోయినా తన లేడీ స్టార్ డంతో సినిమాలకి కోట్లు కురించింది.

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి.. జేజమ్మగా టాలీవుడ్ ను శాశించిన అనుష్క ఆతరువాత చిన్నగా సినిమాలకు దూరం అయ్యింది. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఆమె.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ప్రాచారం జరుగుతోంది. ప్రస్తుతం అనుష్క- నవీన్‌ పొలిశెట్టి(Naveen Polishetty) కీలక పాత్రల్లో వస్తున్న మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి(Ms.Shetty Mr.Polishetty) సినిమాలో నటిస్తోంది. ఈసినిమానే ఆమెకు చివరి సినిమా అంటూ టాలీవుడ్ లో ప్రాచారం జరుగుతోంది.

అంతే కాదు అనుష్క సినిమాలు చేద్దాం అనుకున్నా ఆమెకు పెద్దగా అవకావాలు లేవు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనుష్కను ఆమె ప్యాన్స్ చూడలేరు. దాంతో.. అవకాశాల కోసం పాకులాడకుండా. రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందట టాలీవుడ్ జేజమ్మ.మరి సినిమాలు మానేసి ఆమె ఏం చేస్తుంది.. ఇక పెళ్ళి పీటలు ఎక్కుతుందా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

కాని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ తర్వాత సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు సినీ జనాలు. ఒక రకంగా అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా సైజు జీరో. ఈసినిమా ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. వేరే అవకాశం రాకుండా చేసింది. సైజ్ జీరో కోసం అనుష్క వెయిట్ పెరిగింది. కాని ఆతరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తగ్గలేకపోయింది. దాంతో ఆమెకెరీర్ లో మంచి మంచి పాత్రలు కోల్పోవలసి వచ్చింది.

Updated On 29 July 2023 7:17 AM GMT
Ehatv

Ehatv

Next Story