యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas), అనుష్కలది(Anushka) హిట్‌ పెయిర్‌! వీరిద్దరు కలిసి నటించిన మిర్చి(Mirchi), బిల్లా(Birla), బాహుబలి(Bahubali) సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడాయన రేంజ్‌ బాలీవుడ్‌ కూడా కాదు.. హాలీవుడ్‌! అనుష్కకు మాత్రం బాహుబలి తర్వాత పెద్ద హిట్‌ లేదు. భాగమతి సినిమా కాస్త బెటర్‌! ఏ ముహూర్తానా జీరో సైజ్‌(Size Zero) సినిమా చేసిందో అప్పటి నుంచి అనుష్కకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

సినిమా కోసం వెయిట్‌ పెంచిన అనుష్క తర్వాత ఆ భారాన్ని తగ్గించుకోలేకపోయింది. లేటెస్ట్‌గా నవీన్‌ పొలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తోంది. షూటింగ్‌ ఆల్‌మోస్టాల్‌ కంప్లీట్‌ అయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాల నుంచి తప్పుకుంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ సమయంలో ఓ అదిరిపోయే న్యూస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌- అనుష్క కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్టు చాన్నాళ్ల నుంచి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. సినిమాలకు గుడ్‌బై చెబుతున్నదని తెలిసి దర్శకుడు మారుతి(Maruthi) ఆమెను అప్రోచ్‌ అయ్యారట.

ప్రభాస్‌తో తీస్తున్న సినిమాలో నటించమని అనుష్కను రిక్వెస్ట్ చేశాడట. హీరోయిన్‌గా కాకుండా సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఆమెను అడిగాడట. అందుకు అనుష్క కూడా ఓకే చెప్పిందట! కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కల్కి తర్వాత మారుతి దర్శకత్వంలో రూపొందే సినిమా విడుదల అవుతుంది. అదలా ఉంచితే, ప్రభాస్‌- అనుష్క కాంబినేషన్‌లో మరో పిరియాడికల్‌ సినిమా తీయడానికి డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఓ కథను ప్రిపేర్‌ చేశారట. ఇదే కథను బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ(Sobhu Yarlagadda), ప్రసాద్‌ దేవినేనిలకు(Prasad Devineni) వినిపించారట! వారు కూడా ఎంతో ఇంప్రెస్‌ అయ్యారని, సినిమా తీయడానికి ముందుకొచ్చారని వినికిడి! ప్రభాస్‌ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ప్రభాస్‌- అనుష్క జంటను మళ్లీ పెద్ద తెరమీద చూసే అవకాశం కలుగుతుంది.

Updated On 29 July 2023 4:56 AM GMT
Ehatv

Ehatv

Next Story